బాలికల బంగారు భవిష్యత్తుకు ‘బంగారు బాల్యం’ భరోసాగా నిలుస్తుందని ప్రకాశం జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా అన్నారు. మార్కాపురం కళాశాల రోడ్డులోని సౌజన్య ఫంక్షన్ హాలులో గురువారం డివిజన్ పరిధిలోని అధికారులకు బంగారు బాల్యంపై ఒక రోజు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన కలెక్టర్ తమీమ్ అన్సారియా మాట్లాడుతూ అందరూ సమస్వంతో బాలల భవిష్యత్తు కు బంగారు బాటలు వేయాలన్నారు. బాలికలను సాధికారత దిశగా ఎదగనిస్తేనే వారి భవిష్యత్తుకు భరోసా ఉంటుందన్నారు. బాల్య వివాహాలను నివారించేందుకు అందరూ సమష్టిగా కృషి చేయాలన్నారు. బాలికల ఆరోగ్యం, విద్య, సమగ్ర అభివృద్ధిపై దృష్టి సారించాల న్నారు. మారుమూల ప్రాంతాల్లో ఎంతోమంది బాలలు బడికి వెళ్లకుండా పనులబాట పడుతున్నారన్నారు. బాలలను తప్పక బడికి పంపాలన్నారు. ప్రతి పాఠశాలలో ఒక ఉపాధ్యాయున్ని నోడల్ ఆఫీసర్‌గా నియమించి డ్రాపవుట్స్‌పై దృష్టి సారిస్తామన్నారు. వయసును బట్టి శిక్షణ ద్వారా వారి లోని నైపుణ్యాలను అభివృద్ధి చేయాలన్నారు. బాల్యవివా హాల వలన గర్భం దాల్చి అనారోగ్యంతో కూడిన బావిభారత పౌరులకు జన్మనిస్తున్నార న్నారు. ప్రభుత్వ వైద్యశాల ల్లోనే ప్రసవం జరిగేలా చర్యలు తీసుకోవాల్సి ఉంద న్నారు. ప్రతి సచివాలయం పరిధిలో బాలబాలికలతో పాటు కిషోర బాలికల వివరాలు త ప్పక నమోదు చేయాలన్నారు. కార్యక్రమంలో సబ్‌కలెక్టర్ వెంక ట్ త్రివినాగ్, డీఎస్పీ డాక్టర్ యు.నాగరాజు, ఐసీ డీఎస్ పీడీ హీనాసుజన్, తహ సీల్దార్ చిరంజీవి, కమిషనర్ నారాయణరావు, సీఐ పి.సుబ్బా రావు, ఎస్సై సైదుబాబు పాల్గొన్నారు.