ట్రెండింగ్
Epaper    English    தமிழ்

త్వరలోనే పేదలకు నివాస స్థలాలు ఇస్తాం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Jan 31, 2025, 12:39 PM

త్వరలోనే రాష్ట్ర ప్రభుత్వం నూతన పింఛన్లు, రేషన్‌కార్డులు, పేదలకు నివాస స్థలాలు ఇస్తుందని ఎమ్మెల్యే వర్ల కుమార్‌రాజా తెలిపారు. పామర్రులోని తన కార్యాలయంలో గురువారం గ్రీవె న్స్‌ డే కార్యక్రమాన్ని ఆయన నిర్వహించారు. ప్రజలనుంచి వచ్చిన ఆర్జీలను స్వీకరించారు. ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలని, కొత్త పింఛన్లు అందించాలని, డ్రెయినేజీలు, శ్మశానవాటికలు అభివృద్ధి చేయాలని కోరుతూ ప్రజలు అర్జీలను అందించారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి తాడిశెట్టి నరేష్‌, తెలుగుయువత రాష్ట్ర కార్యదర్శి పానుగంటి సందీప్‌, కాటూరి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com