కుందుర్పి మండలం అపిలేపల్లిలో వెలిసిన ఆంజనేయస్వామి రథాన్ని కర్ణాటక రాష్ట్రం గదక్ లో సిద్ధం చేశారని శుక్రవారం ఆలయ నిర్వాహకులు తెలిపారు. గత ఏడాది జరిగిన ఆంజనేయస్వామి రథోత్సవంలో రథం కుప్పకూలిపోయింది.
దీంతో ఆంజనేయస్వామి భక్తులు, ఆలయ కమిటీ సభ్యులు, గ్రామస్థులు చందాల ద్వారా రూ. 1. 70కోట్లు వసూలు చేశారు. రూ. 1. 10 కోట్లతో గదక్ లో రథాన్ని తయారు చేయించారు. శుక్రవారం సాయంత్రం ఆపిలేపల్లికి రథాన్ని తీసుకొస్తారు.