ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రత్యేక హోదా ఇవ్వకుంటే మద్దతు ఉపసహరించుకోవాలి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Jan 31, 2025, 12:06 PM

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల బహిరంగ లేఖ రాశారు. నేటి నుంచి ప్రారంభం అయ్యే పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో ప్రత్యేక హోదాపై పట్టుబట్టాలని డిమాండ్ చేశారు. హోదానే రాష్ట్ర అభివృద్ధికి సంజీవని... హోదాతోనే సంపద సృష్టి అని తెలిపారు. ఏపీ అప్పుల్లో ఉందని, కొత్తగా అప్పులు పుట్టడం లేదని చెప్పారు. రాష్ట్ర అభివృద్ధి జరగాలంటే సంపద సృష్టి జరగాలని.. హోదాతోనే సంపద సృష్టి జరుగుతుందని అన్నారు. రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలకు నిధుల కోసం కేంద్రం వద్ద దేహి అని ప్రాధేయపడవద్దని చెప్పారు. హోదా ఉంటే కేంద్రమే 30 శాతం నిధులు రాష్ట్రానికి ఇవ్వాల్సి ఉంటుందని ఇప్పటికైనా తెలుసుకోవాలని అన్నారు.


రాష్ట్రంలో పెట్టుబడుల కోసం దావోస్‌ల చుట్టూ తిరగడం కాదని.. హోదాతో రాష్ట్రానికి కంపెనీలు క్యూ కడతాయని గ్రహించాలని అన్నారు.ప్రత్యేక హోదా ఇవ్వకుంటే మద్దతు ఉపసహరించుకోవాలని అన్నారు. కేంద్రంలో పెద్దన్న పాత్ర పోషించే అవకాశం మీకు ఉన్నప్పుడు.. రాష్ట్రానికి ప్రత్యేక హోదా అడగడానికి వచ్చిన ఇబ్బంది ఏంటని ప్రశ్నించారు. మీ మద్దతుతో అధికారం అనుభవిస్తున్న మోదీ.. రాష్ట్ర విభజన హామీలను వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ఈ నెల 31 నుంచి జరుగుతున్న పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో కూటమి ఎంపీలు తమ గళం విప్పాలని అన్నారు. పదేళ్లు హోదా ఇస్తామని ఇచ్చిన మాట మీద ప్రధాని మోదీని నిలదీయాలని చెప్పారు. హోదా ఇవ్వకపోతే కేంద్రానికి ఇచ్చిన మద్దతును తక్షణం ఉపసంహరించుకోవాలని కోరారు. లేకుంటే రాష్ట్ర ప్రజల ముందు మరోసారి మిమ్మల్ని ద్రోహిగా నిలబెడతామని వైఎస్ షర్మిల హెచ్చరించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com