ఆంధ్రప్రదేశ్‌లో వాట్సాప్ సేవలను గురువారం నాడు ఏపీ ప్రభుత్వం ప్రారంభించింది. ఇక నుంచి ప్రభుత్వ ధ్రువపత్రాలన్నీ వాట్సాప్ ద్వారానే ప్రజలకు అందేలా చర్యలు తీసుకుంటుంది. వాట్సాప్ సేవల కోసం ఓ నెంబర్‌ను విడుదల చేసింది. వాట్సాప్ గవర్నెన్స్ కోసం నెంబర్ 9552300009ను వినియోగించుకోవాలని సూచించింది. దేశంలోనే తొలిసారి వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా పౌర సేవలు అందించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. మొదటి విడతలో 161 సేవలను వాట్సాప్ ద్వారా అందించనుంది. తొలి విడతలో దేవాదాయ, విద్యుత్ శాఖ, ఆర్టీసీ, రెవెన్యూ, అన్నా క్యాంటీన్, సీఎంఆర్ఎఫ్, మున్సిపల్ శాఖల్లో ఈ సేవలను ఏపీ ప్రభుత్వం అందుబాటులో ఉంచింది. ఈ మేరకు వాట్సాప్ గవర్నెన్స్‌పై సీఎం నారా చంద్రబాబు నాయుడు సామాజిక మాధ్యమం ఎక్స్‌లో కీలక ట్వీట్ చేశారు.