భోగాపురం పరిధిలోని నారుపేట సమీపం జాతీయ రహదారిపై గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో డెంకాడ మండలం మోదవలస గ్రామానికి చెందిన బోని అప్పలనాయుడు(50) మృతి చెందారు. అప్పలరాజు భోగాపురం నుంచి రాజాపులోవ కారులో వెళ్తున్నాడు. అ యితే నారుపేట సమీపంలో ఎదురుగా వస్తున్న జేసీబీని కారు ఢీకొంది. దాంతో అప్పలనాయుడుకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రున్ని చికిత్స నిమిత్తం తగర పువలసలోని ఓ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందారు.