ఇంగ్లాండ్‌పై టీ20 సిరీస్ సాధించేందుకు భారత్ ముందడగు వేసింది. హార్దిక్ పాండ్యా స్టన్నింగ్ ఫిఫ్టీ (30 బంతుల్లో 53, 4 ఫోర్లు, 4 సిక్సర్లు) తో రెచ్చిపోవడంతో శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో భారత్ మంచి స్కోరు సాధించింది. అటు బ్యాటింగ్ కు ఇటు బౌలింగ్ కు అనుకూలమైన పిచ్‌పై బ్యాటర్లు తమవంతు పాత్ర పోషించారు. అంతకుముందు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన భారత్ 20 ఓవర్లలో 9 వికెట్లకు 181 పరుగులు చేసింది. ఆల్ రౌండర్ శివమ్ దూబే (34 బంతుల్లో 53, 7 ఫోర్లు, 2 సిక్సర్లు) అర్థ సెంచరీతో కీలకదశలో రాణించాడు. ఒకదశలో 79/5తో నిలిచిన జట్టును హార్దిక్, శివమ్ దూబే జంట ఆదుకుంది. ఆరో వికెట్ కు 87 పరుగులు జోడించింది. దీంతో ఇండియా అనుకున్నదానింకటే భారీ స్కోరు సాధించింది.