వాస్తు శాస్త్రం ప్రకారం ఉదయం నిద్ర లేవగానే కొన్ని వస్తువులను చూడొద్దని నిపుణులు అంటున్నారు. అలా చూడటం వల్ల అశుభం కలుగుతుందట. నిద్ర నుంచి లేవగానే పగిలిన, పాడైన గడియారం చూస్తే కీడు జరుగుతుందట. లేవడంతోనే అద్దంలో మనల్ని మనం చూసుకోవడం దురదృష్టానికి సంకేతం. అలాగే రాత్రి తిన్న గిన్నెలను ఉదయం చూడొద్దని, అలా చేయడం వల్ల ఆర్థిక సమస్యలకు దారి తీస్తుందని చెబుతున్నారు.