పొద్దు తిరుగుడు విత్తనాలలో ఉండే ఆరోగ్యకరమైన కొవ్వులు, యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తాయి. మంచి కొలెస్ట్రాల్‌ను పెంచుతాయి. దీంతో రక్తనాళాల్లో ఉండే అడ్డంకులు తొలగిపోతాయి. గుండె ఆరోగ్యంగా ఉంటుంది. హార్ట్ ఎటాక్ రాకుండా చూసుకోవచ్చు. పొద్దు తిరుగుడు విత్తనాల్లో ఉండే విటమిన్ బి6, మెగ్నిషియం జ్ఞాపకశక్తిని పెంచుతాయి. ఏకాగ్రతను కలిగిస్తాయి. మానసిక ప్రశాంతత లభిస్తుంది.