ప్రతి ఒక్కరికీ పెరిగిన అవగాహన కారణంగా రోజుకి ఏదో ఒక వర్కౌట్ చేయాలని, ఫిట్‌గా ఉండాలనుకుంటారు. నిజానికీ ఎక్సర్‌సైజ్ అనేది కేలరీల బర్న్ కోసం చేస్తుంటారు చాలా మంది. అందుకోసమే వర్కౌట్ చేయలేకపోయినా ఇంట్లో వారి పనులు వారే చేసుకోవడం, లేదా వాకింగ్ వంటివి చేయడం చేస్తుంటారు. వీటి వల్ల కేలరీలు బర్న్ అవుతాయి. అయితే, వాకింగ్, ఇంటి పనులు.. రెండింటిలో ఏది ఎక్కువగా కేలరీలు బర్న్ చేస్తుందనేది ఎవరికీ తెలియదు. ఆ వివరాలే ఏంటో తెలుసుకోండి.
ఇంటి పనులు చేయడం
వాకింగ్ చేయాలనుకునేవారు అదే టైమ్‌లో ఇంటి పనులు చేస్తున్నాం కదా అంటూ కాస్తా వాకింగ్‌ని పక్కన పెట్టేస్తుంటారు. నిజానికీ ఇంటిపనులు చేయడం కూడా ఓ రకమైన ఫిజికల్ స్ట్రెంథ్ వర్కట్ వంటిదే. వాకింగ్, ఇంటి పనులు దేనికదే ప్రత్యేకం రెండూ కూడా ఒక్కో బెనిఫిట్‌ని కలిగి ఉంటుంది. అవేంటో తెలుసుకోండి.
వాకింగ్
వాకింగ్ అనేది సింపుల్ అండ్ ఎఫెక్టివ్ వర్కౌట్. దీనిని ఎవరైనా చేయొచ్చు. అందుకే, పార్కుల్లో చాలా మంది వాకింగ్ చేస్తూనే కనిపిస్తారు. మాట్లాడుతూ బ్రిస్క్ వాక్ చేయడం వల్ల మనం ఎంతగానో కేలరీలను బర్న్ చేయొచ్చు. దీని వల్ల కేలరీలు బర్న్ అవుతాయి. బరువు తగ్గుతారు. వాకింగ్ చేయడం వల్ల వచ్చే రిజల్ట్స్ మనం చేసే టైమ్‌ని బట్టి ఉంటుంది. ఉదాహారణకి 70 కిలోల బరువున్న వ్యక్తి గంటకి మైళ్ల వేగంతో నడిస్తే గంటలో 240 కేలరీలు బర్న్ అవుతాయి. అదే బ్రిస్క్ వాక్ 4 మైళ్ళ వేగంతో నడిస్తే 300 కేలరీలు బర్న్ అవుతాయి.
వాకింగ్‌తో లాభాలు
వాకింగ్ చేయడం వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయి. ముఖ్యంగా గుండె ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. మజిల్స్‌కి బలం అందుతుంది. స్ట్రెస్ దూరమై మానసికంగా హెల్దీగా ఉంటారు. ఇది లో ఇంపాక్ట్ యాక్టివిటీ అని చెప్పొచ్చు. ముఖ్యంగా ఈ వర్కౌట్ ఏ ఏజ్ అయినా చేయొచ్చు. బయట వాతావరణంలో నడవడం వల్ల మంచి తాజా గాలి, ఎండ కూడా తగులుతుంది. దీంతో విటమిన డి లెవల్స్ కూడా బూస్ట్ అవుతాయి. ఈ కారణంగా కేలరీల బర్న్ ఈజీగా అవుతుంది. కాస్తా స్పీడ్‌గా నడిస్తే మంచి రిజల్ట్స్ ఉంటాయి. నడుస్తూ ఇంకేదైనా బరువులు మోస్తే చాలా త్వరగా కేలరీలు బర్న్ అవుతాయి.
ఇంటి పనులు
ఇంటి పనులు చేయడం వల్ల మనకి సరిపడా ఫిటనెస్ గోల్స్ అందవు. కానీ, మనం ఇల్లు తుడవడం, మాప్ పెట్టడం, గార్డెనింగ్, బట్టలు ఉతకడం వంటివన్నీ కూడా కొద్దిగా ఎక్సర్‌సైజ్‌లా పనిచేసి ఎనర్జీని అందిస్తాయి. అదే విధంగా, ఈ పనులన్నీ కూడా ఒక్కొక్కటి ఒక్కో విధంగా వర్కౌట్ చేస్తాయి. ఉదాహారణకి 70 కిలోలున్న వ్యక్తి వాక్యూమ్ చేస్తే 200 కేలరీలు బర్న్ అవుతాయి. గార్డెనింగ్ చేస్తే 250 నుంచి 300 కేలరీలు ఖర్చవుతాయి. ఇది మనం చేసే పనులని బట్టి ఉంటుంది. అదే విధంగా, గిన్నెలు తోమడం వల్ల గంటకి 90 కేలరీలు బర్న్ అవుతాయి. కాబట్టి, పనులని బట్టి కేలరీల బర్నింగ్ మారుతుంది.
ఇంటిపనులు ఎలా ఉండాలంటే
ఇంటిపనులు కూడా మనం చేసే విధంగా మారుతుండాలి. లిఫ్టింగ్, బెండింగ్ వంటి మూమెంట్స్ ఉన్న వర్కౌట్స్ కూడా ఎక్కువగా కేలరీలు బర్న్ అవుతాయి. సెడెంటరీ లైఫ్‌స్టైల్ బదులు ఈ పనులు ఎక్కువగా కేలరీలను ఖర్చు చేస్తాయి. ఇది మనుషులని బట్టి కూడా మారుతుంటుంది.
ఏది బెటర్
కేలరీలు బర్న్ చేయడమే మీ లక్ష్యమైతే ఇంటి పనులు బదులు బ్రిస్క్ వాక్ చేయడం చాలా బెస్ట్. గంటకి 4 మైళ్లు నడిస్తే మీరు ఈజీగా 300 నుంచి 400 కేలరీలు బర్న్ అవుతాయి. అయితే, ఇది మీ వెయిట్‌ని బట్టి కూడా ఉంటాయి. ఇంటి పనులు కూడా మంచి ఛాయిస్. కానీ, క్లీనింగ్ చేసే టప్పుడు ఊడవడం, మాపింగ్, స్క్రబ్బింగ్ వంటివి 250 నుంచి 300 కేలరీలు బర్న్ చేస్తాయి. ఇంటి పనుల కంటే బ్రిస్క్ వాక్ అనేది ఎక్కువగా కేలరీల బర్న్ అవుతాయి. ఇంటి పనులు కూడా కాస్తా కష్టమైనవి చేసినప్పుడే రిజల్ట్ ఉంటుంది. కాబట్టి, రిజల్ట్ కావాలనుకుంటే వర్కౌట్ చేయండి.
కొన్ని టిప్స్
మీరు రోజూ 30 నిమిషాల పాటు వాకింగ్ చేస్తే హార్ట్ రేట్ పెరుగుతుంది. మెటబాలిజం పెరిగి ఎక్కువగా కేలరీలు ఖర్చవుతాయి. మజిల్స్ వర్కౌట్ కావాలనుకుంటే ఇంటి పనుల్లోనే డిఫరెంట్ వర్కౌట్స్ చేయొచ్చు. ఒకవేళ మీరు వాకింగ్ చేయాలనుకున్నప్పుడు టైమ్ లేకపోతే కాస్తా కష్టమైన ఇంటిపనులు చేయండి.