వేసవి కాలంలో అందరు వేడిని తగ్గించుకునే మార్గాలను అన్వేషించి వాటిని పాలో అవుతారు. కొందరు సీజనల్ గా దొరికే పండ్లను తింటారు. కాని ఎన్ని చేసినా వేసవిలో వడదెబ్బకు గురవుతారు.రకరకాల అనారోగ్యాల బారిన పడుతుంటారు. వేసవిలో ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే తీసుకోవలసిన ఆహార పదార్థాలు ఏమిటో తెలుసుకుని అవి రోజూ వారి డైట్ లో చేర్చుకోవాలి. వేసవిలో ఆయిల్ ఫుడ్స్ కి దూరంగా ఉండాలి. ఇంటి వంటలలో కూడా నూనె వాడకం తగ్గించాలి. ఆకుకూరలు ఎక్కువగా తీసుకోవాలి. మసాలా కూరలు తగ్గించాలి. ఉదయం పూట అల్పాహారంగా నూనె తో చేసిన వంటలు కాకుండా ఆవిరి కుడుములు, ఇడ్లీ వంటి వాటిని తీసుకోవాలి.కర్భుజా, పుచ్చకాయలు, ఈత కాయలు, తాటి ముంజులు వంటి సీజనల్ పండ్లను తీసుకోవాలి. కాఫీ, టీ లకు దూరంగా ఉండాలి. వాటి స్థానంలో రాగి జావ తాగాలి. దీని వల్ల ఇమ్యునిటీ పవర్ పెరుగుతుంది. కూల్ డ్రింకులకు బదులుగా కొబ్బరి నీరు తాగాలి. మజ్జిగ అన్నంలో మామిడి పండ్లను కలిపి తినడం వల్ల విటమిన్ ఏ, డి శరీరానికి అధిక మోతాదులో అందుతాయి.
పలుచని మజ్జిగలో నిమ్మ రసం, ఉప్పు కలిపి పిల్లలు, పెద్దలు అందరూ తాగితే ఆరోగ్యానికి చాలా మంచిది. సాధారణంగా వేసవి సెలవులు కావటంతో పిల్లలు బయటికి వెళ్లి ఆడుకుంటారు. అలా కాకుండా ఇండోర్ గేమ్స్ మాత్రమే ఆడించాలి. కిటికీలకు, గుమ్మాలకు వట్టి వేర్ల తెరలను తడిపి కట్టుకుంటే వేడిని ఇంట్లోకి రానీయకుండా చల్లగా ఉంచుతుంది. ఏసిలు, కూలర్లు వాడే కన్నా ఇలాంటి తెరలను వాడటం వల్ల ఆరోగ్యంగా ఉండొచ్చు.