కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువై ఉన్న ఆ తిరుమల తిరుపతి కొండపై భక్తుల రద్దీ ఒక్కసారిగా పెరిగి పోయింది. శ్రీవారి దర్శనం కోసం 23 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. దీంతో శ్రీనివాసుడి సర్వ దర్శనానికి భక్తులకు 10 గంటల సమయం పడుతుండగా.. టైమ్ స్లాట్ దర్శనం భక్తులకు 4 గంటల సమయం పడుతుండగా.. 300 రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లు కొనుగోలు చేసిన భక్తులకు శ్రీవారి దర్శనం 3 నుంచి 4 గంటల సమయం పడుతుంది. నిన్న స్వామి వారిని 58,908 మంది భక్తులు దర్శించుకోగా.. శ్రీవారి హుండీ ఆదాయం రూ.3. 23 కోట్లు వచ్చినట్లు తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు అధికారులు వెల్లడించారు.అయితే, నిన్నటి వరకు భక్తుల రద్దీ తక్కువగా ఉన్నప్పటికి రేపు శనివారం, ఆదివారాలు కావడంతో భక్తుల రద్దీ మరింత పెరిగే అవకాశం ఉందని టీటీడీ అధికారులు అంచనా వేస్తున్నారు. ఇక, ముందుగా ప్రత్యేక దర్శనం టిక్కెట్లను బుక్ చేసుకున్న వారితో పాటు ఏ రోజు కా రోజు ఎస్ఎస్డీ టోకెన్లు కూడా జారీ చేస్తుండటంతో తిరుమలకు వచ్చే వారి సంఖ్య రోజు రోజుకి పెరిగిపోతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు పేర్కొంటున్నారు.
![]() |
![]() |