ఇంగ్లండ్‌తో జరిగిన తొలి వన్డే మ్యాచ్ శ్రేయాస్ అయ్యర్ ఎదురుదాడి చేసిన తీరు అద్భుతమని భారత మాజీ పేసర్ జహీర్ ఖాన్ పేర్కొన్నారు. శ్రేయాస్‌ను తదుపరి మ్యాచుల్లో ఇలాగే కొనసాగిస్తే బాగుంటుందని జహీర్ వ్యాఖ్యానించారు.
రెండో వన్డే నాటికి విరాట్ సిద్ధమవుతాడని ఇప్పటికే వైస్ కెప్టెన్ గిల్ వెల్లడించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మంచి ఫామ్‌లో ఉన్న శ్రేయాస్‌ను పక్కనపెట్టడం సరైంది కాదని జహీర్ వెల్లడించారు.