కరోనా తర్వాత చాలా మందిలో వ్యాయామం మీద అవగాహన పెరిగింది. ఉదయాన్నే వాకింగ్, జాగింగ్, యోగా, జిమ్‌లో వర్కౌట్లు వంటివి చేస్తున్నారు. కొందరు వ్యాయామానికి దూరంగా ఉంటున్నారు. మరికొందరు ఫిట్‌గా ఉండటానికి వాకింగ్‌ని ఆప్షన్‌గా తీసుకుంటున్నారు. చాలా మంది ఆరోగ్యం కోసం వాకింగ్ చేస్తున్నారు. ఇంకొందరు బరువు తగ్గడం కోసం వాకింగ్ చేస్తున్నారు. మరికొందరు ఆరోగ్యంగా ఉంటామన్న భావనతో వాకింగ్ చేస్తున్నారు. చాలా మంది సులువుగా చేయగలిగే వ్యాయామం వాకింగ్. నడక వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. వాకింగ్ చేయడం చాలా ఈజీ. రోజూ వాకింగ్ చేయడం వల్ల ఎన్నో లాభాలు ఉంటాయి. అయితే, ప్రతి వారం కనీసం 150 నిమిషాలైనా నడవాలంటున్నారు నిపుణులు. ఇలా నడవడం వల్ల ఎన్నో లాభాలు ఉంటాయి. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం.
డబ్ల్యూహెచ్ఓ్ ప్రకారం
ఆరోగ్యంగా ఉండటానికి.. ఉదయం లేదా సాయంత్రం ఎప్పుడైనా నడవచ్చు. ఉదయం నడవడం వల్ల శరీరం యొక్క సర్కాడియన్ రిథమ్‌ను సరిచేయడంలో సహాయపడుతుంది. ఇది రాత్రి మంచి నిద్రకు సహాయపడుతుంది. సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ ప్రకారం.. మీరు వారానికి కనీసం 150 నిమిషాల వాకింగ్ లేదా రోజుకు 30 నిమిషాలైన నడకను అలవాటు చేసుకోవాలి. ఇలాంటి నడకతో ఎన్నో లాభాలు ఉంటాయి. ఆ ప్రయోజనాలేంటో తెలుసుకుందాం.
బరువు తగ్గుతారు
క్రమం తప్పకుండా ప్రతి రోజూ కనీసం ముప్పై నిమిషాలు నడవడం ద్వారా చాలా కేలరీలు బర్న్ చేయవచ్చు. ఇలా నడవడం వల్ల జీవక్రియ రేటు పెరుగుతుంది. దీని కారణంగా శరీరం ఎక్కువ కేలరీలను బర్న్ చేస్తుంది. రెగ్యులర్ వాకింగ్ చేయడం వల్ల శరీరంలో పేరుకుపోయిన కొవ్వు, ముఖ్యంగా బెల్లీ ఫ్యాట్ తగ్గుతుంది. అంతేకాకుండా వారానికి 150 నిమిషాలు నడవడం ద్వారా బరువు తగ్గవచ్చుంటున్నారు నిపుణులు.
మానసిక ఆరోగ్యం మెరుగు
ఈ రోజుల్లో చాలా మంది ఒత్తిడితో బాధపడుతున్నారు. ముఖ్యంగా ఈ రోజుల్లో వర్క్ లైఫ్ స్టైల్ వల్ల వచ్చే పని బత్తిడి కారణంగానే గుండె పోటు సమస్యల్ని ఎదుర్కొంటున్నారు. ఇలాంటి వారికి వాకింగ్ మంచి ఆప్షన్. ప్రతి రోజూ నడవడం వల్ల మానసిక ఆరోగ్యం మెరగవుతుంది. రోజూ వాకింగ్ చేయడం వల్ల శారీరకంగానే కాదు మానసికంగా కూడా బలపడవచ్చు. ప్రతి రోజూ నడవడం వల్ల మనసుకు ఉపశమనం లభిస్తుంది. ప్రకృతిలో నడవడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది. దీంతో, ఒత్తిడిని తగ్గించుకోవచ్చని నిపుణులు అంటున్నారు.
కండరాలు, ఎముకలు దృఢంగా
ప్రతి రోజూ నడవడం వల్ల కాళ్ల కండరాలు బలపడుతాయి. దీంతో కీళ్లలో ఫ్లెక్సిబిలిటీ పెరుగుతుంది. కీళ్ల నొప్పులు, కండరాల నొప్పిని వాకింగ్‌తో తగ్గించుకోవచ్చు. ప్రతి రోజూ నడవడం వల్ల కాల్లలో రక్త ప్రసరణ మెరగవుతుంది. దీంతో కండరాలు ఫ్లెక్సిబిలీటీగా మారతాయి. అంతేకాకుండా డైలీ వాకింగ్ వల్ల ఎముకలు చాలా బలంగా మారుతాయి. ఎముకల ద్రవ్యరాశి బలోపేతంగా మారుతుంది. రెగ్యులర్‌గా నడవడం వల్ల ఎముకల బోలు, ఆస్టియోపోరోసిస్ వంటి వ్యాధుల్ని నివారించవచ్చు. ప్రతిరోజూ కనీసం ఒక కిలోమీటర్ అయినా నడిస్తే ఈ లాభాలు అందుతాయని నిపుణులు అంటున్నారు.
జీర్ణసమస్యలకు చక్కటి పరిష్కారం
ఈ రోజ్లులో చాలా మంది జీర్ణ సమస్యలతో బాధపడుతున్నారు. ఇలాంటి వారికి నడక మంచి ఆప్షన్. ప్రతి రోజూ కనీసం ఒక కిలోమీటర్ అయినా నడవాలి. ఇలా నడవడం వల్ల జీవక్రియ మెరగవుతుంది. జీవక్రియ వేగవంతం అవ్వడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. అంతేకాకుండా ఆమ్లతను తగ్గిస్తుంది. దీంతో, గ్యాస్ సమస్యల నుంచి రిలీఫ్ లభిస్తుంది.
ఇలా నడిస్తే బరువు తగ్గుతారు
గంటకు 5 కి.మీ కంటే ఎక్కువ నడిచేటప్పుడు మీ వీపుపై కొంత బరువును జోడించండి. ఇలా బరువులో 5 నుండి 7 శాతం తగ్గించుకోవచ్చు. దీనిని రకింగ్ అంటారు. సాధారణంగా ఆర్మీ సైనికులు వీపు వెనుక బరువున్న బ్యాగుల్ని ధరించి నడుస్తుంటారు. అయితే, వారి అంత బరువు కన్నా తక్కువగా వీపు వెనుక బ్యాగుల్ని తగిలించుకుని నడవడం వల్ల మంచి ఫలితం ఉంటుందంటున్నారు నిపుణులు. వీపుపై కొంత బరువుతో వాకింగ్ చేసినప్పుడు ఎక్కువ కేలరీలు బర్న్ అవుతాయి. అంతేకాకుండా కండరాలు దృఢంగా మారతాయి. అయితే, మొదట్లో చిన్న చిన్న బరువులు మోస్తూ.. ఆ తర్వాత పెంచుకుంటూ పోవడం మంచిది. ఒకేసారి ఎక్కువ బరువుతో వాకింగ్ చేస్తే గాయాలయ్యే ప్రమాదముందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
![]() |
![]() |