కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎన్‌ఆర్‌ఈజీఎస్ చట్టాన్ని ఉల్లంఘించి, కాంట్రాక్టు పద్దతిలో టీడీపీ నాయకులకు పనులు కేటాయిస్తూ చేసుకున్న ఒప్పందాలను రద్దు చేస్తున్నట్టు హైకోర్టు తీర్పు చెప్పిందని వైయస్ఆర్‌సీపీ రాష్ట్ర పంచాయతీరాజ్ విభాగం అధ్యక్షుడు వెన్నపూస రవీంద్రారెడ్డి వెల్లడించారు. ఈ మేరకు కోర్టు తీర్పును అమలు చేయాలని కోరుతూ ఈనెల 17న వైయస్ఆర్‌సీపీ పంచాయతీరాజ్ విభాగం తరఫున రాష్ట్రంలోని అన్ని కలెక్టర్లకు వెళ్లి వినతిపత్రాలు అందజేస్తామని తెలిపారు. చట్టాలను ఉల్లంఘిస్తున్న కూటమి ప్రభుత్వానికి కోర్టు తీర్పు చెంపపెట్టు వంటిదన్న రవీంద్రారెడ్డి, అధికారులు ఉత్తర్వులను ఉల్లంఘిస్తే మరోసారి కోర్టుకు వెళ్లడానికి వెనుకాడబోమని హెచ్చరించారు.
![]() |
![]() |