కరీంనగర్ జిల్లా మానకొండూర్ మండలం దేవంపల్లి గురుకుల విద్యాలయం విద్యార్థులు జెఈఈ మెయిన్స్ పరీక్ష ఫలితాల్లో సత్తా చాటారు.తెలంగాణ వ్యాప్తంగా ఉన్న గురుకులాల్లో దేవంపల్లి గురుకులానికి ఐదవ స్థానం దక్కింది.దేవంపల్లి గురుకుల పాఠశాల,కళాశాలలోని ఐదుగురు విద్యార్థులు జెఈఈ మెయిన్స్ లో క్వాలిఫై అయినట్లు ప్రిన్సిపాల్ గోలి జగన్నాథం బుధవారం తెలిపారు. పరీక్ష ఫలితాల్లో ఆర్.ప్రదీప్ 92.2,జి.లోచన్ 84.27,కె.హరికుమార్ 73.94, పి.రామ్ చరణ్ 67.94,డి.రంజిత్ కుమార్ 67.2 పర్సెంటేజ్ సాధించారన్నారు.
తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాల్లో దేవంపల్లి జేఈఈ మెయిన్స్ పరీక్ష ఫలితాల్లో ఐదవ స్థానంలో నిలవడం హర్షనీయమన్నారు.ఈ సందర్భంగా దేవంపల్లి గురుకుల పాఠశాలలో జేఈఈ మెయిన్స్ లో క్వాలిఫై సాధించిన విద్యార్థులను ప్రిన్సిపాల్ గోలి జగన్నాథం,ఉపాధ్యాయులు అభినందించారు.పేరెంట్స్ కమిటీ అధ్యక్షులు రేణికుంట బాబు జేఈఈ మెయిన్స్ లో క్వాలిఫై అయిన విద్యార్థులకు ప్రోత్సాహకంగా పెన్నులను బహుకరించారు.కార్యక్రమంలో దేవంపల్లి గురుకుల పాఠశాల సీనియర్ వైస్ ప్రిన్సిపాల్ కొమురయ్య,జూనియర్ వైస్ ప్రిన్సిపాల్ రబియా,ఉపాధ్యాయులు,పేరెంట్స్ లు పాల్గొన్నారు.
![]() |
![]() |