చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకుడు రంగరాజన్ పై జరిగిన దాడిని ఖండిస్తూ జగిత్యాల జిల్లా మల్యాల మండలం ముత్యంపేట గ్రామం కొండగట్టు శ్రీఆంజనేయస్వామి ఆలయ అర్చక బృందం దాడిని ఖండించారు. ఈ సందర్భంగా అర్చకులు మాట్లాడుతూ రామరాజ్యం స్థాపకులు రంగరాజన్ పై దాడి చేయడం చాలా హేయమైన చర్య అని రంగరాజన్ తండ్రి అయిన సౌందర్య రాజన్ కొండగట్టు దేవస్థానానికి అవినాభావ సంబంధం ఉన్నదని, ఆలయంలో పనిచేసే అర్చకులు భగవంతున్ని నమ్ముకుని నిరంతరం సేవ చేస్తున్నారని అన్నారు.
రంగ రాజన్ ఎప్పటినుండో రామ రాజ్య స్థాపనకు పాటుపడుతున్నరని ఎవరో కొత్తగా వచ్చి బలవంతంగా చేయవలసిన అవసరం లేదని తెలిపారు. ఆలయ వైదిక బృందం తరపున రంగరాజన్ కు పూర్తిస్థాయి మద్దతును ప్రకటిస్తున్నామని తెలిపారు.రంగరాజన్ పై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకులు కపిందర్, చిరంజీవి ఆలయ అర్చకులు బృందం పాల్గొన్నారు.
![]() |
![]() |