వల్లభనేని వంశీపై కిడ్నాప్, దాడి కేసు కిడ్నాప్, బెదిరింపు, దాడి కేసులో వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని విజయవాడ పటమట పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. హైదరాబాద్ లో ఆయనను అదుపులోకి తీసుకున్న పోలీసులు నేరుగా విజయవాడకు తరలించారు. తొలుత విజయవాడ భవానీపురం పీఎస్ కు ఆయనను తీసుకెళ్లారు. అనంతరం వాహనాన్ని మార్చి, ఆయనను అక్కడి నుంచి రెండు, మూడు మార్గాల్లో తీసుకెళ్తూ చివరకు కృష్ణలంక పీఎస్ కు తరలించారు. కృష్ణలంక పీఎస్ లో ప్రస్తుతం ఆయనను విచారిస్తున్నారు. గంట నుంచి ఆయన విచారణ కొనసాగుతోంది.కాసేపట్లో ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించి, జడ్జి ముందు ప్రవేశపెట్టే అవకాశం ఉంది. మరోవైపు వంశీ తరపు న్యాయవాదులు కూడా కోర్టును ఆశ్రయించే అవకాశం ఉందని చెపుతున్నారు. వంశీపై ఏడు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఇందులో నాన్ బెయిలబుల్ సెక్షన్లు కూడా ఉన్నాయి. కృష్ణలంక పీఎస్ వద్ద భద్రతను పెంచారు.వంశీ అరెస్ట్ నేపథ్యంలో ఏపీ రాజకీయాలు వేడెక్కాయి. ఇది అక్రమ అరెస్ట్ అంటూ వైసీపీ నేతలు విమర్శిస్తున్నారు. రాజకీయాల్లో కక్ష సాధింపులు ఉండరాదని చెపుతున్నారు. వంశీలాంటి వ్యక్తికి శిక్షపడాల్సిందేనని టీడీపీ నేతలు అంటున్నారు.
![]() |
![]() |