జుట్టుకి చాలా మంది షాంపూలు వాడతారు. వీటిలో కెమికల్స్ ఉంటాయి. దీని వల్ల జుట్టు సమస్యలు ఎదురవుతాయి. అలా కాకుండా జుట్టుని ఆరోగ్యంగా ఉంచే హెయిర్ వాష్ పౌడర్ని ఇంట్లోనే తయారుచేయొచ్చు. అదెలానో తెలుసుకోండి.
మనలో చాలా మంది వారానికి రెండు, మూడుసార్లైనా తలస్నానం చేస్తాం. తలని శుభ్రం చేసేందుకు చాలా మంది ఈజీగా లభించే షాంపూలు వాడతాం. ఇదివరకటి రోజుల్లో అయితే కుంకుడు కాయ, శీకకాయతో తలని క్లీన్ చేసుకునేవాళ్ళం. కానీ, ఇప్పుడు అలా కాదు. తలని క్లీన్ చేసుకునేందుకు ఈజీగా షాంపూలు దొరుకుతున్నాయి. వాటితోనే క్లీన్ చేసుకుంటున్నాం. కానీ, వీటిలోని కెమికల్స్ కారణంగా జుట్టు సమస్యలు, చుండ్రు సమస్యలు వస్తున్నాయి. వీటన్నింటికీ చెక్ పెట్టేందుకు మనం ఇంట్లోనే షాంపూ పౌడర్ని తయారుచేసుకోవచ్చు. అదెలానో తెలుసుకోండి.
కావాల్సిన పదార్థాలు
షికకాయ : 4 కప్పులు
కుంకుడు కాయలు : 1 కప్పు
ఎండు ఉసిరి : 1 కప్పు
అరప్పు పొడి : 4 కప్పులు
ఎండిన మందార పూల పొడి : 4 నుంచి 5 కప్పులు
కరివేపాకు పొడి : 1 కప్పు
పెసల పొడి : 1 కప్పు
మెంతుల పొడి : 1 కప్పు
వట్టివేరు పొడి : 1 స్పూన్
బ్రహ్మి : 1 కప్పు
ఎండు వేపాకుల పొడి : 1 కప్పు
పదార్థాలను ఎలా తీసుకోవాలంటే
ఈ పదార్థాలన్నీ మనకి ఆయుర్వేద, హెర్బల్ షాపుల్లో దొరుకుతాయి. వీటిన్నింటిని తీసుకొచ్చి మనం చక్కగా ఆరబెట్టుకోవచ్చు. సువాసన కోసం మనం రోజా పూరేకుల పొడిని కూడా వాడొచ్చు. అయితే, అన్నీ ఎక్కువ క్వాంటిటీలో చెబుతున్నాం. అలా కాకుండా అన్నీ ఒక్కో స్పూన్ పరిమాణంలో తీసుకోండి. దీని వల్ల ఇది నెలరోజుల వరకూ సరిపోతుంది. లేదంటే అన్నింటినీ మీ జుట్టు పరిమాణాన్ని ఎంతమంది వాడుతున్నారనేదాన్ని బట్టి తీసుకోవచ్చు.
తయారీ విధానం
తీసుకున్న అన్నీ పదార్థాలని బాగా ఎండలో ఆరబెట్టి పొడిలా చేయాలి. అయితే, కుంకుడుకాయలు, షికకాయ వంటివి త్వరగా పొడిలా మారవు. కాబట్టి, వీటిని పొడిచేసినవే తీసుకోండి. వీటన్నింటిని చక్కగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న పొడిన ఓ గాజు సీసాలో స్టోర్ చేయాలి. ఇవన్నీ కూడా నేచురల్ పదార్థాలు కాబట్టి ఎలాంటి సమస్యలు ఉండవు. అయినప్పటికీ కొంతమందికీ పడకపోవచ్చు. కాబట్టి, వాడే ముందు ప్యాచ్ టెస్ట్ చేయాలి. అదే విధంగా, ఎవరికైనా పడని పదార్థం ఉందనిపిస్తే వాటిని తీసేసి వాడుకోవచ్చు. వీటిని మనం ఈజీగా 6 నుంచి 8 నెలల వరకూ వాడుకోవచ్చు.
ఎలా వాడాలి
ఇలా తయారైన పొడిని మీ జుట్టు పొడవుని బట్టి తగిన పరిమాణంలో తీసుకుని కొద్దిగా నీరు పోసి పేస్టులా చేయాలి. ఇప్పుడు జుట్టుని తడిగా చేసి స్కాల్ప్, హెయిర్కి ఈ పేస్టుని రాసి బాగా మసాజ్ చేయాలి. రెగ్యులర్ షాంపూలానే దీనిని యూజ్ చేయాలి. కాసేపు అలానే ఉండి తర్వాత క్లీన్ చేయాలి.
వాడిన తర్వాత
అయితే, ఈ షాంపూ పౌడర్ వాడిన మొదట్లో చిక్కులుగా ఉంటుంది. అయితే, దీనిని మనం నిదానంగా వాడం అలవాటు చేసుకోవాలి. చిక్కులు ముందుగానే తీసేసుకోవాలి. దీనిని వాడడం వల్ల ఎన్నో లాభాలు ఉంటాయి. ముఖ్యంగా, జుట్టు రాలడం తగ్గుతుంది. జుట్టు సమస్యలు కూడా దూరమవుతాయి. మొదట్లో కొద్దిపరిమాణంలోనే రాయాలని గుర్తుంచుకోండి. షాంపూ తర్వాత వీలైతే మంచి కండీషనర్ వాడాలి. అయితే, ఇందులో కలిపిన మందార పూరేకులు కూడా కండీషనర్ గుణాలను కలిగి ఉంటుందని గుర్తుపెట్టుకోండి.
![]() |
![]() |