వంటకాలలో రుచి కోసం మెంతులు వినియోగిస్తుంటాం. అయితే మెంతులను రోజూ తీసుకోవడం వల్ల అనేక వ్యాధులకు చెక్ పెట్టొచ్చని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా మధుమేహాన్ని తగ్గించడంలో మెంతులు కీలక పాత్ర పోషిస్తాయని చెబుతున్నారు. మెంతులను వాటర్‌లో నానబెట్టి పరగడుపున తాగడం వల్ల వాటిలో ఉండే ఇనుము, మాంగనీస్, మెగ్నీషియం అజీర్తి, జీర్ణసమస్యలు అలాగే మధుమేహాన్ని నివారిస్తాయని నిపుణులు పేర్కొంటున్నారు.మెంతులు ఒక్క డయాబెటిస్‌కి మాత్రమే కాదు అధిక బరువు, అధిక కొలెస్ట్రాల్ వంటి సమస్యలకు చక్కటి పరిష్కారంగా చెబుతున్నారు. జీర్ణవ్యవస్థను మెరుగుపరచడంలోనూ ఇవి చాలా బాగా సహాయపడతాయి. ముఖ్యంగా వీటిల్లోని పీచు పొట్ట ఆరోగ్యానికి మేలు చేసే బ్యాక్టీరియా పెరగడానికి తోడ్పడుతుంది. అంతేకాకుండా, శరీరంలోని చెడు కొలస్ట్రాల్ అయిన ఎల్‌డీఎల్‌ను నియంత్రించి, గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. పాలిచ్చే తల్లులకు ఈ గింజలు ఎంతో మేలు చేస్తాయి. అలాగే, ఆరోగ్యకరమైన జుట్టు పెరుగుదలనూ ప్రోత్సహిస్తాయి. అదనంగా పీసీఓడీ(PCOD) ప్రాబ్లమ్‌తో ఇబ్బంది పడే మహిళలకూ మెంతులు చాలా బాగా ఉపయోగపడతాయంటున్నారు డాక్టర్ గాయత్రీదేవి.
![]() |
![]() |