వన్‌ప్లస్ నార్డ్ CE 4 ఇప్పుడు అమెజాన్‌లో కళ్లు చెదిరే డిస్కౌంట్‌తో లభిస్తోంది. నిజానికి ఈ ఫోన్ అసలు ధర రూ.24,999, కానీ ఇప్పుడు ఏకంగా రూ.3,000 ధర తగ్గించి, కేవలం రూ.21,999 కే లిస్ట్ చేశారు. HDFC లేదా యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ఉంటే, ఇంకాస్త డిస్కౌంట్ వస్తుంది. అంతేకాదు, మీ పాత ఫోన్‌ను ఎక్స్‌ఛేంజ్ చేస్తే, వన్‌ప్లస్ నార్డ్ CE 4ని మీరు కేవలం రూ.19,499కే సొంతం చేసుకోవచ్చు.
వన్‌ప్లస్ Nord CE 4 చూడటానికి చాలా స్టైలిష్‌గా, ప్రీమియమ్ లుక్‌తో వస్తుంది. ఇందులో 6.7-అంగుళాల Full హెచ్‌డీ + AMOLED డిస్‌ప్లే ఉంటుంది. రిజల్యూషన్ 1080×2412 పిక్సెల్స్. 20.1:9 యాస్పెక్ట్ రేషియో ఉండటం వల్ల స్క్రీన్ చాలా పొడవుగా, స్టైలిష్‌గా కనిపిస్తుంది. దీని బ్రైట్‌నెస్ 1100 నిట్స్. అంటే ఎండలోనూ స్క్రీన్ క్లియర్‌గా కనిపిస్తుంది. మీరు ఫొటోలు, వీడియోలు తీయడానికి ఇష్టపడేవారైతే, ఈ ఫోన్ మీకు పర్ఫెక్ట్ ఛాయిస్. ఇందులో 50MP మెయిన్ కెమెరా ఉంది, అది కూడా ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS)తో వస్తుంది. ఈ OIS టెక్నాలజీతో ఫొటోలు, వీడియోలు షేక్ అవ్వకుండా చాలా క్లియర్‌గా, స్టెడీగా వస్తాయి. వెనకాలే 8MP అల్ట్రా-వైడ్ లెన్స్ కూడా ఇచ్చారు, దానితో విశాలమైన ఫొటోలు కూడా తీసుకోవచ్చు. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 16MP కెమెరా ఉంది. ఇది కూడా చాలా షార్ప్‌గా, డీటెయిల్డ్‌గా పిక్చర్స్ ఇస్తుంది. అంతేకాదు యూజర్ల బొమ్మను వీడియో కాల్స్‌లో చాలా క్లియర్ గా చూపిస్తుంది. 5500mAh బ్యాటరీ. ఒక్కసారి ఛార్జ్ చేస్తే రోజంతా హాయిగా వాడుకోవచ్చు, మళ్లీ ఛార్జింగ్ పెట్టే పనిలేదు. ఇంకా ఇందులో 100W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది. అంటే కేవలం 29 నిమిషాల్లో 0 నుంచి 100% వరకు ఛార్జ్ అయిపోతుంది.
![]() |
![]() |