మునగకాయ, మునగాకు, పువ్వుల వాళ్ళ చాల ప్రయోజనాలు వున్నాయ్, కొలెస్ట్రాల్, మధుమేహం సమస్య దూరం కావాలంటే మునగ ఆకులను పొడి చేసి తింటే మేలు జరుగుతుందని ఆయుర్వేద నిపుణులు తెలిపారు. మునగకాయను రోటీ, పరాటా, దోశ, పులుసు, పప్పులో చేర్చి కూడా మనం తినవచ్చు. ఇంకా మునగకాయతో రసం కూడా తయారు చేసి తాగవచ్చు. ప్రతిరోజు మునగాకు జ్యూస్ ని పరగడుపున తీసుకోవడం వల్ల అధిక బరువు, షుగర్ లెవెల్స్ అదుపు చేయడంలో ఎంతో సహాయపడుతుంది. అలాగే వయసుతో సంబంధ లేకుండా చాలా మంది మలబద్దకం సమస్యతో బాధపడుతున్నారు. ఈ సమస్య నుంచి బయట పడాలంటే మునగాకు నీరు ప్రతిరోజు ఉదయం ఖాళీ కడుపుతో తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల జీర్ణక్రియ వ్యవస్థ మెరుగుపడుతుందని నిపుణులు చెబుతున్నారు.
![]() |
![]() |