చిన్న పిల్లల్లో శారీరక ఎదుగుదల కోసం ఎన్నో రకాల పోషక పదార్థాలు కావాల్సిందే. అందుకోసం విటమిన్లు, ప్రొటీన్లు, మినరల్స్ సహా అని రకాల పోషకాలు ఉండే సమతుల ఆహారం అందించాలి. ముఖ్యంగా పిల్లల ఎదుగుదలకు తోడ్పడే వాటిలో కాల్షియం తప్పనిసరిగా అందాలని వైద్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు. శరీరంలో ఎముకల పెరుగుదలకు, బలోపేతానికి ఇది అత్యంత ఆవశ్యకమని స్పష్టం చేస్తున్నారు.మునగ ఆకులతో మన శరీరానికి అవసరమైన పోషకాల్లో చాలా వరకు మునగ ఆకుల నుంచి పొందవచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు. అందులోనూ మునగ ఆకుల్లో కాల్షియం ఎక్కువగా ఉంటుందని, ఇది పిల్లల్లో ఎముకల పెరుగుదలకు తోడ్పడుతుందని వివరిస్తున్నారు.పిల్లలకు మునగ ఆకులు తినిపించేదెలా మునగ ఆకులను బాగా కడిగి, మంచి నీటిలో వేసి ఉడికించాలని... తర్వాత ఆ నీటిని పిల్లలకు పరగడుపున తాగిస్తే మంచి ప్రయోజనం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.పిల్లలకు అరటిపండు, పాలకూర, మునగ ఆకులు కలిపి గ్రైండ్ చేసి... అందులో పాలు కలిపి స్మూతీగా చేసి తినిపిస్తే అద్భుతమైన ఆరోగ్యం సొంతమవుతుందని వివరిస్తున్నారు.మునగ ఆకులను దోసకాయ, క్యారెట్ వంటి వాటితో కలిపి జ్యూస్ గా చేసి తాగిస్తే కూడా మంచి ప్రయోజనం ఉంటుందని చెబుతున్నారు.ఈ జ్యూస్ ను పిల్లలు నేరుగా తాగలేకపోతే... వడగట్టి, కాస్త తేనె కలిపి ఇస్తే బాగుంటుందని నిపుణులు చెబుతున్నారు.పిల్లలు రోజూ నిద్రపోయే ముందు గోరు వెచ్చని పాలలో ఒకట్రెండు స్పూన్ల మునగాకు పొడిని కలిపి తాగించడం వల్ల వారి శరీరానికి తగినంత కాల్షియం అంది... ఎదుగుదల బాగుంటుందని వివరిస్తున్నారు.వివిధ రకాల కూరగాయలతో చేసుకునే సూప్ లలో మునగాకు పొడిని కలపడం వల్ల రుచి పెరగడంతోపాటు ఆరోగ్యానికీ మంచిదని సూచిస్తున్నారు.ఇంట్లో వండుకునే కూరలు, సలాడ్లలో మునగాకును వినియోగించడం వల్ల కూడా మంచి ప్రయోజనం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.మునగాకులో ఎన్నో అద్భుత పోషకాలు ఉంటాయని... అవి పిల్లలకే కాదు, పెద్దవారికీ ఎంతో ఆరోగ్యకరమని నిపుణులు చెబుతున్నారు. అయితే కేవలం మునగాకు మాత్రమే సరిపోదని... అన్ని రకాల ఆహారం సమతుల్యంగా ఉండేలా చూసుకోవడం ముఖ్యమని వివరిస్తున్నారు.
![]() |
![]() |