గార్లదిన్నె మండలంలోని శ్రీ కోటంక సుబ్రహ్మణ్యం స్వామిని రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత దర్శించుకున్నారు. మాఘమాసం ఆదివారం సందర్భంగా ఆలయంలో పూజలు నిర్వహించారు.
ఆలయానికి వచ్చిన ఆమెకు టీడీపీ నాయకులు ఘన స్వాగతం పలికారు. అనంతరం స్వామివారిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఆలయ అర్చకులు వారికి శాలువలతో ఘనంగా సన్మానించారు.
![]() |
![]() |