న్యూఢిల్లీ, మార్చి 2025- ఎల్జి ఎలక్ట్రానిక్స్ ఇండియా టివి ఎల్జి ఛానల్స్ విస్తరణను ప్రకటించింది. ఈ సర్వీస్ వినోదం, మ్యూజిక్, న్యూస్, కిడ్స్, జీవన శైలి మరియు ఇంకా ఎన్నో వాటిలో విభిన్నమైన కంటెంట్ ను ఎలాంటి చెల్లింపు లేదా సబ్ స్క్రిప్షన్ లేకుండా కేటాయిస్తోంది. Lఎల్జీ ఛానల్స్ తో, సెట్-టాప్ బాక్స్ లు, సబ్ స్క్రిప్షన్స్ లేదా చెల్లింపులు లేకుండా ఎల్జి స్మార్ట్ టివి యూజర్లు వీక్షణ అనుభవం ఆనందించవచ్చు. యూజర్లు కోసం విస్తృతమైన కంటెంట్ రకం పొందడానికి సర్వీస్ నిర్థారింస్తుంది, వినోదంలో సౌకర్యాన్ని అందిస్తుంది.
వివిధ శైలుల్లో విస్తరించిన ప్రసిద్ధి చెందిన ఛానల్స్ తో ఎల్జి ఛానల్స్ విస్తృత శ్రేణి ప్రేక్షకులకు సేవలు అందిస్తోంది, కుటుంబంలో ప్రతి ఒక్కరి కోసం తప్పనిసరిగా ఒక ఛానల్ ఉందని నిర్థారిస్తోంది. ప్లాట్ ఫాం భారతదేశపు భాష వైవిధ్యాన్ని కూడా సంబరం చేస్తోంది. హిందీ, ఇంగ్లి, మరియు ప్రాంతీయ భాషలైన పంజాబీ, భోజ్ పురి, తమిళం, తెలుగు, మరాఠీ, గుజరాతీ మరియు బెంగాలీ భాషలలో కంటెంట్ ను అందిస్తోంది. ఎల్జి ఎలక్ట్రానిక్స్ ఇండియా ఎండి శ్రీ హాంగ్, జు జియాన్ మాట్లాడుతూ “ ఎల్జి ఎలక్ట్రానిక్స్ ఇండియాలో, మేము మా కస్టమర్ల కోసం వినోదం అనుభవం పై దృష్టి కేంద్రీకరించాము. ఎల్జి ఛానల్స్ ఇప్పుడు అన్ని వయస్సులు మరియు ఆసక్తులు కలిగిన ప్రేక్షకులకు 100కి పైగా ఉచిత ఛానల్స్ ను అందిస్తున్నాయి. మా కస్టమర్లకు మరింత వ్యక్తిగతమైన కంటెంట్ ను తీసుకురావడానికి మేము LG ఛానల్స్ ను విస్తరించడం కొనసాగిస్తామన్నారు.
![]() |
![]() |