మనలో చాలా మంది నాన్ వెజ్ ను ఇష్టంగా తింటారు. అయితే, బర్డ్ ఫ్లూ వలన చికెన్ కు దూరంగా ఉంటున్నారు. దాదాపు 45 రోజులు అవుతుంది ..జనాలు దీని వాసన కూడా చూడక .. ! అంతక ముందు ఆదివారం వస్తే చాలు .. ఉదయానికే ముక్క ఇంట్లో పడాలిసిందే.. మధ్యాహ్నానానికి ఉడకాల్సిందే అన్నట్లు ఉండేది. కానీ, ఇప్పుడు రోజులు మారాయి. పప్పు చారుతో సరి పెడుతున్నారు.నాన్ వెజ్ ప్రియులు కోడి తర్వాత, మటన్, చేపలను తింటుంటారు. కొందరికి చేప ముళ్లు అంటే చాలా భయం. అవి గొంతులో గుచ్చుకుంటే .. నొప్పిగా ఉంటుందని తినకుండా ఉంటారు. కానీ, వాస్తవానికి చేప మన శరీరానికి ఎంతో మేలు చేస్తుందని నిపుణులు కూడా చెబుతున్నారు. వీటిని కచ్చితంగా వారంలో 2 సార్లు తీసుకుంటే ఎన్నో రకాల సమస్యలు రాకుండా ఉంటాయని అంటున్నారు. వీటిని తినడం అలవాటు చేసుకుంటే .. అనేక రకాల పోషకాలు లభిస్తాయని వైద్యులు చెబుతున్నారు.మహిళలు చేపలను ( Fish ) తీసుకోవడం వలన ఎడినోమాకు చెక్ పెట్టొచ్చని కొత్త పరిశోధనల్లో తెలిపారు. వారానికి రెండుసార్లు కాకపోయినా నెలకు మూడు సార్లు అయిన తీసుకుంటే ఎడినోమా వ్యాధి మహిళలకు సోకకుండా ఉంటుందని హెల్త్ యూనివర్శిటీకి చెందిన డాక్టర్స్ వెల్లడించారు.ఎడినోమా ( Adenoma ) అనేది పుట్టగొడుగు పరిమాణంలో ఉంటుంది. మహిళల్లో కొలొరెక్టల్ క్యాన్సర్‌కు దారి తీస్తుందని ఎడ్వర్డ్ చెప్పారు. ఈ ప్రాణాంతక సమస్యకు చెక్ పెట్టాలంటే చేపలను మూడు రోజులకొకసారైనా తీసుకోవాలని తెలిపారు. ఇలా మీ ఫుడ్ డైట్ లో చేపను చేర్చుకోవడం వలన కొన్ని అనారోగ్య సమస్యలను నయం చేయవచ్చునని పరిశోధనలో తెలిపారు.
![]() |
![]() |