జగన్మోహన్‌రెడ్డి ఇక జీవితంలో ఎప్పటికీ సీఎం కాలేడు అని జనసేన నేత బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు. అయన మాట్లాడుతూ.... నమ్ముకున్నవారిని కూడా ఆయన మోసం చేస్తారు. చివరకు నా ఆస్తితోపాటు నా వియ్యంకుడి ఆస్తిని కూడా కొంత కాజేశారు. కూటమి ప్రభుత్వం ఇప్పటివరకు చిన్నచిన్న వైసీపీ కార్యకర్తలనే జైల్లో వేసింది. అదే నేనైతే కోట్లాది రూపాయలు కాజేసిన వారిని ఒక్క రోజులోనే జైల్లో వేసేవాడిని. నా ప్రాణం ఉన్నంతవరకు పవన్ కల్యాణ్‌తోనే ఉంటా. పవన్‌తో కలిసి ఒక సినిమా తీయాలనుకుంటున్నా. నాకు రాజశేఖరరెడ్డి రాజకీయ భిక్ష పెట్టారు. అందుకు జగన్ పార్టీ పెడితే మంత్రి పదవి వదులుకుని ఆయన వెంట నడిచాను. కానీ ఆయన నాకెంతో అన్యాయం చేశాడు. మంత్రి పదవి ఇచ్చి తీసేశాడు. అయినా నేను లెక్కపెట్టలేదు. వంశీని, పోసానిని అరెస్టు చేస్తే వాళ్లను పరామర్శించాడు. అధికారంలో ఉండగా రఘురామరాజును కొట్టించావు. చంద్రబాబు భార్యను తిట్టించావు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 9 నెలలకు వాళ్లను లోపలేశారు. నేనైతే మొదటిరోజే లాఠీతో కొట్టించేవాడిని అని అన్నారు.
![]() |
![]() |