ముంబైలో తమ క్యాబ్ లలో విమానాశ్రయానికి వెళ్లే ప్రయాణికులకు విమానం ఆలస్యమైతే రూ.7,500 వరకు పరిహారం అందించే 'మిస్డ్ ఫ్లైట్ కనెక్షన్ కవర్' పథకాన్ని క్యాబ్ సంస్థ ఉబర్ ప్రారంభించింది. రిలయన్స్ జనరల్ ఇన్సూరెన్స్‌తో కలిసి ఈ పథకాన్ని ప్రవేశపెట్టింది. సమయానికి విమానాశ్రయానికి చేరుకోవడం చాలా ముఖ్యమని, ట్రాఫిక్ సమస్యల వల్ల కలిగే ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఉబర్ తెలిపింది. ఈ పరిహారం పొందడానికి, రైడ్ బుక్ చేసుకున్న వ్యక్తి క్లెయిమ్ ఫారమ్, మిస్ అయిన ఫ్లైట్ టికెట్, తిరిగి బుక్ చేసుకున్న టికెట్ వివరాలను సమర్పించాల్సి ఉంటుంది. ఒకవేళ క్యాబ్ ప్రయాణంలో ప్రమాదం జరిగితే, వైద్య ఖర్చులను కూడా ఉబర్ భరిస్తుంది.
![]() |
![]() |