ట్రెండింగ్
Epaper    English    தமிழ்

16.03.2025 నుండి 22.03.2025 వరకు ద్వాదశరాశి ఫలములు (వార ఫలాలు)

Astrology |  Suryaa Desk  | Published : Sun, Mar 16, 2025, 10:34 AM

1) మేషరాశి.... (అశ్విని 1 2 3 4,భరణి 1 2 3 4,కృతిక 1వ పాదం) (నామ నక్షత్రములు: చూ, చే ,చొ, లా,లీ,  లూ, లే, లో,ఆ)
వారం ప్రారంభంలోసంతృప్తి తక్కువగా ఉంటుంది. శ్రమతో కార్యక్రమాలు ప్రారంభిస్తారు. వృత్తికి సంబంధించిన విషయాలు కొంతవరకు లాభదాయకంగా ఉంటాయి. ఆరోగ్య విషయంలో శ్రద్ధ అవసరం  శ్రమతో గౌరవాన్ని ఆదాయాన్ని పెంచుకుంటారు. శత్రువుల మీద విజయం సాధిస్తారు. రోగ నిరోధక శక్తిని పెంచుకోవాలి నైపుణ్యాలు పెరుగుతాయి. న్యాయ సంబంధమైన విషయాలు అనుకూలంగా ఉంటాయి. నూతన వృత్తుల కొరకు ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి. వారం మధ్యలో మైత్రి బంధాలు బాగుంటాయి సంఘంలో గుర్తింపు గౌరవం అభివృద్ధికరంగా ఉంటుంది. జీవిత భాగస్వామితో అనుకూలమైన వాతావరణం. తదుపరి  గృహాలంకరణ కొరకు, వ్యక్తిగత అవసరముల కొరకు  కొనుగోలు ప్రయత్నం చేస్తారు. వారాంతంలోముఖ్యమైన పనులు కొంత వాయిదా, కుటుంబ సభ్యులతో ఘర్షణాత్మకమైన వాతావరణాన్ని అధిగమించాలి. వ్యక్తుల సహకారం ఆశించిన స్థాయిలో ఉండకపోవడం వల్ల  అప్రశాంతంగా ఉంటారు. ఆరోగ్య విషయంలో శ్రద్ధ తీసుకోవాలి ముఖ్యంగా  నిద్రలేమి. మానసిక ఆందోళన అధికంగా ఉంటుంది.  ఉన్నత విద్య కొరకు ప్రయత్నించేవారు ఎక్కువ శ్రమ పడాలి విద్యాపరమైన విషయాలలో  సాధారణ ఫలితాలు పొందుతూ ముందుకు పెడతారు.అమ్మవారి ఆరాధన చేస్తారు. మంచి ఫలితాల కొరకు ఇష్టదేవతారాధన మంచిది.


 


2) వృషభరాశి...(కృతిక 2,3,4,రోహిణి 1 2 3 4,మృగశిర 1 2 పాదాలు) (నామ నక్షత్రములు:ఈ, ఊ, ఎ, ఓ, వా, వీ, వూ, వె, వో)  


వారం ప్రారంభంలో తల్లితండ్రుల సహకారంతో భవిష్యత్తు ప్రణాళికలు రూపొందించుకుంటారు. సృజనాత్మకత బాగుంటుంది. ఇష్టమైన వ్యక్తుల కొరకు, లేదా సంతానము అభివృద్ధి కొరకు అధికమైన ఖర్చులు చేస్తారు.  వృత్తిపరమైన విషయాలు అనుకూలంగా ఉంటాయి.వ్యాపార భాగస్వాములతో మైత్రి బంధాలు బాగుంటాయి. శ్రమకి తగిన గుర్తింపు గౌరవం లభిస్తుంది. వ్యాపారాన్ని విస్తరించే ఆలోచనలో ఉంటారు. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. సోషల్ మీడియా మొదలైన చోట్ల మీ నెట్వర్క్ ఉపయోగించి వృత్తి వ్యాపారాల్లో అభివృద్ధి కొరకు కొత్త కమ్యూనికేషన్ విధానాలు రూపొందిస్తారు. ఆదాయం కన్నా శ్రమకి తగిన గౌరవము గుర్తింపు లభిస్తుంది.  వ్యాపార భాగస్వాములతోనూ, ఉన్నతాధికారులు రాజకీయ నాయకులు మొదలైన వారి సహకారం కోరుకునేటప్పుడు, ముఖ్యంగా ఆర్థిక సంబంధాంశాలలో మాట్లాడే మాటల కమ్యూనికేషన్ దగ్గర జాగ్రత్తలు వహించాలి.  వారం మధ్యలో శత్రువుల మీద విజయం సాధించడానికి ఆరోగ్య మీద శ్రద్ధకి రుణములు చెల్లించడానికి ఖర్చులు అధికంగా ఉంటాయి. తదుపరి  దూర ప్రదేశాల్లో ఉండే మిత్రుల నుండి బహుమానాలు, విదేశీ వృత్తికి సంబంధించిన విషయంలో చర్చలు.అప్రసన్నమైన సమాచారం మానసిక ఘర్షణకు కారణమవుతుందిసహకారం బాగుంటుంది. ఆకస్మిక ఖర్చులు ప్రయాణాలు. ఆరోగ్య విషయంలో శ్రద్ధ తీసుకోవాలి.  మరిన్ని మంచి ఫలితాల కొరకు దుర్గాదేవి ఆరాధన మంచిది


3) మిధున రాశి...(మృగశిర 3 4,ఆరుద్ర 1 2 3 4,పునర్వసు 1,2,3 పాదాలు) (నామ నక్షత్రములు: కా, కి, కూ, ఖం , జ్ఞ, చ్చ, కే, కో, హ, హి)  


వారం ప్రారంభంలో చంద్రుడు కేతువు తో కలిసి చతుర్ధ స్థానంలో ఉండటం వల్లప్రశాంతత తక్కువగా ఉంటుంది. ముఖ్యంగా ఉన్నత వ్యవసాయము, తల్లి ఆరోగ్యం, విద్యా సంబంధమైన విషయాలు, గృహ వాహన అంశాల మీద ఎక్కువ ఫోకస్ చేస్తారు.  తండ్రి పెద్దల సహకారం సామాన్యంగా అందుతుంది. ఆధ్యాత్మిక ఆలోచనలు అధికంగా ఉంటాయి.విద్యార్థుల కష్టంతో పనిచేసే శ్రమతో విజయాలు సాధిస్తారు. వ్యక్తిగత ఆరోగ్యం మీద, ముఖ్యంగా కంటికి సంబంధించిన శ్రద్ధ అవసరం. ధైర్యం, పరాక్రమం, నిర్ణయ సామర్థ్యం, కమ్యూనికేషన్ విధానం పెరుగుతాయి. వారం మధ్యలో సంతానం యొక్క  అభివృద్ధి ఎదుగుదల కొరకు  ఆందోళన అధికంగా ఉంటుంది. మీ ఆలోచనలు ఫలిస్తాయి సృజనాత్మకత బాగుంటుంది. వృత్తిపరమైన విషయాలలో మీ సోదరుల సహకారంతో కుటుంబములోని వారికి నూతన అవకాశాలు. దీర్ఘకాలికంగా పడిన శ్రమకి గుర్తింపు గౌరవం నూతన అవకాశాలు. పెండింగ్ లో ఉన్న రుణములను తీర్చగలుగుతారు.  వారం చివరిలో స్నేహ సంబంధాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి కొత్త పరిచయాలు ఏర్పడతాయి మైత్రి బంధాలు బలపడతాయి. ఆకస్మిక ఖర్చులు అధికంగా ఉంటే ఘర్షణలకు దూరంగా ఉండాలి. మరిన్ని మంచి ఫలితాల కొరకు దత్తాత్రేయుని ఆరాధన మంచిది


4) కర్కాటక రాశి...(పునర్వసు 4, పుష్యమి 1 2 3 4, ఆశ్లేష 1 2 3 4 పాదాలు) (నామ నక్షత్రములు: హి, హూ, హే, హో, డా, డీ ,డూ, డే, డో)


వారం ప్రారంభంలోమీ ఆలోచనలకి, సామర్థ్యానికి తగిన గుర్తింపు. ఆత్మీయ ఆధ్యాత్మిక వ్యక్తుల సహకారం బాగుంటుంది. కుటుంబములోని ముఖ్య వ్యక్తులతో, వారి యొక్క సహకారంతో వ్యాపారంలో అభివృద్ధి సాధిస్తారు. వ్యాపార అంశాలు శ్రమతో, అధిక ఒత్తిడితో కూడుకొని ఉన్నప్పటికీ  మీ సహజ సృజనాత్మకతతో మంచి ఆలోచనలతో సరియైన కమ్యూనికేషన్ తో అనుకున్నవి సాధించగలుగుతారు. వృత్తిపరమైన విషయాలలోనూ, సంతాన సంబంధ అభివృద్ధి ఆలోచనలు వల్ల ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ ఆత్మీయులైన వ్యక్తులతో చర్చించి సమన్వయపరిచి పరిస్థితులను అధిగమించ గలుగుతారు. నిర్ణయ సామర్థ్యం ఉంటుంది ప్రశాంతత పెరుగుతుంది వృత్తిలో నిర్ణయాలు తీసుకుంటారు.   విద్యార్థులు విద్యాసంబంధమైన విషయాలలో కొంత శ్రద్ధ చూపించాలి ముఖ్యంగా తల్లి యొక్క ఆరోగ్యం గృహ వాతావరణం పెట్టుబడులు మొదలైన విషయాలు చర్చలకి వస్తాయి. వాహనాలు నడిపే వారు వీలైనంత జాగ్రత్తలు వహిస్తూ ముందుకు వెళ్లాలి. వారాంతములో స్త్రీలతో విభేదాలు రాకుండా, వృత్తిపరమైన విషయాలలో వ్యసనపరులైన వ్యక్తులకు దూరంగా ఉంటూ ఆశించిన ఫలితములు సాధించుకోవాలి. ఆరోగ్య విషయంలో శ్రద్ధ తీసుకోవాలి, రోగనిరోధక శక్తిని పెంచుకోవాలి. వ్యాయమము ప్రాణాయామ విషయం మీద దృష్టి సారించాలి. భాగస్వామికి సంబంధించిన ఆర్థిక విషయాలలో ఆరోగ్య విషయాలలో ఎక్కువ శ్రద్ధ చూపిస్తారు. మరిన్ని మంచి ఫలితాలు కొరకు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన మంచిది.


5) సింహరాశి...(మఖ 1 2 3 4, పుబ్బ 1 2 3 4, ఉత్తర 1వ పాదం)  (నామ నక్షత్రములు: మా, మీ, మూ, మే, మో, టా, టీ, టూ, టే)


వారం ప్రారంభంలోఆర్థిక సంబంధమైన అంశాలు అపార్ధాలు చికాకులు రాకుండా కుటుంబ సభ్యులతో, స్నేహితులతోపరుషమైన మాటల వల్ల,  జాగ్రత్త వహించాలి.ఉద్వేగాలు నియంత్రించుకోవాలి. ప్రయాణ విషయాలు, తొందరపాటు నిర్ణయాలు, డ్రైవింగ్ సంబంధించి జాగ్రత్తలు తీసుకోవాలి. సంతానానికి విద్యా సంబంధమైన విషయాలలో అభివృద్ధి, జీవిత భాగస్వామికి వృత్తికి సంబంధించిన అంశాలలో తగిన గుర్తింపు గౌరవం, నూతన అవకాశాలు. పలుకుబడి కలిగిన గౌరవనీయులైన గురు సంబంధీకులు, కళా రంగంలో ఉన్న వ్యక్తుల్నికలుస్తారు.  మధ్యలో మంచి నిర్ణయాలు తీసుకుంటారు పరాక్రమం పెరుగుతుంది, కింద వ్యక్తులు మీకు సహకారము ఇస్తారు. వారసత్వపు ఆస్తుల గురించి తల్లితండ్రుల తరపు బంధువులతో దీర్ఘంగా చర్చలు. గృహ వాతావరణ అసౌకర్యంగా ఉంటుంది. నిద్రలేమి. సమయానికి ఆహార స్వీకరణ, విశ్రాంతి అవసరం. వృత్తికి సంబంధించిన విషయాలలో అధికారులతో ఆకస్మిక చికాకులు వివాదాలు. చేయని తప్పుకి ఘర్షణ.  వారం చివరిలో  విద్యాపరమైన విషయాలలో వారి విజయం ఎదుగుదల  మీకు ఆనందాన్ని ఇస్తుంది. జీవిత భాగస్వామితో కలిసి సంతానం పై శ్రద్ధ, వారి అవసరాల గురించి దృష్టి సారిస్తారు. వారితో కలిసి విందులలో పాల్గొంటారు. అయినప్పటికీ ఉద్వేగాలను నియంత్రించుకుంటూ ముందుకు వెళ్లాలి. మరిన్ని మంచి ఫలితాలు కొరకు విష్ణు సహస్రనామాలు వినడం మేలు.


6) కన్యా రాశి...(ఉత్తరఫల్గుణి 2 3 4,హస్త 4,చిత్త 1 2 పాదాలు) (నామ నక్షత్రములు: టో,పా,పి,పూ,షం,ణా,పే,పో)
వారం ప్రారంభంలో వైరాగ్య ఆలోచనలు, ఆరోగ్య సంబంధమైన ఖర్చులు అధికంగా ఉంటాయి. ఆకస్మిక నిర్ణయాలు కొంత కన్ఫ్యూషన్ ఇస్తాయి. సంతానము విద్యా విషయాలు, కుటుంబ బాధ్యతలు ప్రశాంతతని తగ్గిస్తాయి. కుటుంబ వాతావరణం,  ఆర్థిక అంశాలు చర్చలు ఘర్షణాత్మకంగా ఉండే అవకాశం వీలైనంత మౌనం మంచిది. మాటల వల్ల అపార్ధాలు రాకుండా ఉండడం మేలు. తదుపరి మీ సామర్థ్యం పెరుగుతుంది,ఆర్థిక విషయాలు హెచ్చుతగ్గులు. రుణముల విషయంలో రుణదాతలు ఒత్తిడి అధికంగా ఉంటుంది.  తండ్రిగారి సహకారం లభిస్తుంది. ఇతరుల సహాయంతో మీ పనులు సులభంగా నెరవేర్చుకో గలుగుతారు, తండ్రి ఆరోగ్యం మీద శ్రద్ధ తీసుకుంటారు.  శత్రువులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి చేసే కార్యక్రమాలని మీ మేధాశక్తితో ఆలోచనలతో, నైపుణ్యాలు పెంచుకుంటూ అధిగమించ గలుగుతారు. చివరిలో స్థిరాస్తులు, కొనుగోలులో మోసపోకుండా జాగ్రత్త వహించాలి వాహనాలు నడిపేవారు తగిన శ్రద్ధతో ముందుకు వెళ్లాలి. తల్లి ఆరోగ్యం, స్వగ్రామ సందర్శన, ప్రయాణ సమయములలో జాగ్రత్తలు అవసరం.  మరిన్ని మంచి ఫలితాల కొరకు సత్యనారాయణ స్వామి ఆరాధన మేలు.


7) తులారాశి...(చిత్త 3 4,స్వాతి 1 2 3 4, విశాఖ 1 2 3 పాదాలు) (నామ నక్షత్రములు: రా, రి, రూ, రె, రో, తా, తీ, తూ, తే)    వారం ప్రారంభంలోమానసిక ఒత్తిడి విషయంలో యోగ మెడిటేషన్ మంచిది ముఖ్యంగా భావ ప్రకటన సమయంలో భావోద్రేగాలను నియంత్రించుకోవాలి. ముఖ్యమైన విషయాలు, గవర్నమెంట్ సంబంధ పనుల విషయం, రుణములు ఆర్థిక అంశాలు వాయిదా పడ్డం, ఆలస్యాలు చికాకును కలిగిస్తాయి. సమయానికి ఆహార స్వీకరణ నిద్ర విశ్రాంతి అవసరం. బంధువర్గంతో మాట పట్టింపులు లేకుండా ముందుకు వెళ్లాలి. అధిక ఒత్తిడి శ్రమ, ముఖ్యముగా వ్యాపార భాగస్వామి వ్యవహారాలలోనూ ప్రయాణాలలోనూ అధికంగా ఉంటాయి. జీవిత భాగస్వామి తరుపు బంధువులతో ఆర్థిక, సహకార సంబంధమైన విషయాలలో చికాకులు రాకుండా, వివాదాలు లేకుండా ముందుకు వెళ్లాలి. మీ ఆలోచనలు గౌరవనీయంగా ఉంటాయి, సంతాన అభివృద్ధికరంగా ఉంటుంది. వారి తరఫునుంచి శుభవార్తలు మీకు ఆనందాన్ని కలిగిస్తాయి. వారం మధ్యలో జీవిత భాగస్వామితో చర్చించేటప్పుడు గానీ, నిర్ణయాలు సుకునేటప్పుడు గానీ, ముఖ్యంగా వారి ఆరోగ్య విషయం మీద శ్రద్ధ చూపుతూ అనవసర వివాదాలకు, అపార్థ ములకు దూరంగా ఉండాలి.  చివరిలో మీ క్రియేటివిటీ పెరుగుతుంది సామర్ధ్యాలు అనుకూలంగా ఉంటాయి, రోగ నిరోధక శక్తి పెరుగుతుంది, ట్రెక్కింగ్, క్రీడలు, పోటీలు మొదలైన విషయాలు మీద ఎక్కువ ఇష్టం చూపిస్తారు.  సంతానమునకు విజయ అవకాశాలు, గుర్తింపు గౌరవం, పోటీలలో నెగ్గడం మీకు ఆనందాన్ని కలిగిస్తాయి. తోబుట్టువుల సహకారంతో నిర్ణయాలు ధైర్యంగా తీసుకుంటారు మరిన్ని మంచి ఫలితాల కొరకు వెంకటేశ్వర స్వామి దేవాలయ సందర్శన మంచిది


8) వృశ్చిక రాశి...(విశాఖ 4,అనురాధ 1 2 3 4, జేష్ఠ 1 2 3 పాదాలు) (నామ నక్షత్రములు: తో, నా, నీ, నూ, నె, నో, యా, యీ, యు)   


వారం ప్రారంభంలో ఆర్థిక అంశాలు, పెద్దల సహకారం లభిస్తాయి. శత్రు రోగ రుణాలు మీద విజయం సాధిస్తారు. రుణాలు వసూలు అవుతాయి రోగ నిరోధక శక్తి పెరుగుతుంది పోటీలలో విజయాలు సాధిస్తారు. తండ్రితో అభిప్రాయ బేధాలు రాకుండా జాగ్రత్త తీసుకోవాలి. పడిన శ్రమకి తగిన ప్రతిఫలం లభిస్తుంది ఆగిన పనులు ముందుకు సాగుతాయి చిన్ననాటి మిత్రులను కలుస్తారు. వృత్తి సంబంధమైన విషయాలు కొంతవరకు అనుకూలం.  సంఘంలో గుర్తింపు గౌరవం లభిస్తుంది  వారం మధ్యలో వృత్తిలో శ్రమ, ఖర్చులు, సమయానికి విశ్రాంతి లోపం. కొలీగ్స్ సహకారంతో సమ యానికి పనులు నిర్వర్తించడానికి, పై అధికారులతో మాట పడకుండా ఉండడానికి అధిక శ్రమ చేస్తారు. తదుపరి ఆరోగ్యము, ఆర్థిక అంశాలు కొంత ఇబ్బంది, పనులు వాయిదా వేస్తారు. బద్దకాన్ని అధిగమించే ప్రయత్నాలు చేయాలి. కమ్యూనికేషన్ విషయంలో జాగ్రత్త అవసరం.  చివరిలో ఎదురుచూస్తున్న ధన విషయాలు కొంతవరకు అందు తాయి.   తోబుట్టువుల  సహకారం లభిస్తుంది. గృహంలో బంధువులు రాక. మాట్లాడేటప్పుడు, వాహనాలు నడిపేటప్పుడు నిదానత అవసరం. మంచి ఫలితాల కొరకు సూర్యనారాయణ స్వామి ఆరాధన మంచిది


9) *ధనురాశి...(మూల 1 2 3 4,పూర్వాషాఢ 1 2 3 4,ఉత్తరాషాఢ 1వ  పాదం) (నామ నక్షత్రములు: యే, యో, భా,భీ, భూ, ధ, ఫ, డా, భే)


వారం ప్రారంభంలో శ్రమ బాధ్యతలు అధికంగా ఉంటాయి గౌరవం దక్కుతుంది వృత్తి సంబంధించిన విషయాలలో మార్గదర్శకులతో పెద్దలతో కొలీగ్స్తో విభేదాలు రాకుండా జాగ్రత్తగా ఉండాలి. ప్రశాంతత తక్కువగా ఉంటుంది. ఆర్థిక అంశాలు అనుకూలం.  వృత్తిపరమైన విషయాలలో మీ ఆలోచనలు ఆశించిన స్థాయిలో ఫలితములు కొంతవరకు ఉంటాయి.  ఆత్మీయులైన ఇష్టమైన వ్యక్తులు సంప్రదింపులు సామాన్యం. వారం మధ్యలో ఎదురుచూస్తున్న వర్తమానాలు అందుకుంటారు, ఆగిన పనులు ముందుకెడతాయి. ఆర్థిక విషయాలు, సంతాన విషయాలు, ఉపాసన అనుకూలంగా ఉంటాయి. తల్లితరపు బంధువులతో మీ ఆలోచనలు అనుకూలంగా ఉంటాయి. సంతోషకరమైన వాతావరణాన్ని గడుపుతారు. మిత్రుల ఆకస్మిక రాకతో, బహుమతులు అందిపుచ్చు కొనుటలో, విందు వినోదాలతో, శారీరక అలంకరణ పై శ్రద్ధతో ఉంటారు. వ్యవసాయ అంశాలు, స్వగ్రామ సందర్శన తల్లి యొక్క ఆరోగ్యం  గృహముల మీద ఆదాయం అనుకూలంగా ఉంటాయి. తదుపరి స్థిరాస్తుల కొరకు చేసే ప్రయత్నాలలో మోసాలకి గురి అయ్యే అవకాశం ఉన్న రీత్యా అధికారము పలుకుబడి ఉన్న వారి సహాయ సహకారాలతో ముందుకు వెళ్లాలి.  వారం చివరిలో ఉద్వేగాలు నియంత్రించుకోవాలి కంటికి, పాదము కు, సంబంధించిన ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు అవసరం.


 మానసిక ఘర్షణ అధికంగా ఉంటుంది. మరిన్ని మంచి ఫలితములతో నవగ్రహ ఆరాధన, దేవాలయ సందర్శన మంచిది.


10) *మకర రాశి...(ఉత్తరాషాఢ 2 3 4, శ్రవణం 1 2 3 4, ధనిష్ఠ 1 2  పాదాలు) (నామ నక్షత్రములు: భ,జా,జి,ఖి,ఖు,ఖే,ఖో,గా,గి)


*వారం ప్రారంభంలో కుటుంబ కార్యక్రమాలు అనుకూలంగా ఉంటాయి. ఆర్థిక సంబంధమైన విషయాలు, శుభకార్యాల నిమిత్తం చర్చలు జరుగుతాయి. కుటుంబ పెద్దల్ని శ్రేయోభిలాషులని కలిసి వారి ఆశీస్సులు తీసుకుంటారు దూర ప్రయాణాలు ఒత్తిడి అలసటతో కార్యాలు ప్రారంభిస్తారు. ఉన్నత విద్య కొరకు ప్రయత్నం చేసే విద్యార్థులకు శ్రమతో ఫలితాలు.  వారం మధ్యలో వృత్తి సంబంధమైన విషయాలు. మీ సృజనాత్మకత, కొలీగ్స్ సహకారంతో పనులు పూర్తి చేయడం, వ్యాపార వ్యవహారాలు అనుకూలంగా ఉండడం, ఆశించిన ఫలితాలు. ఎదురుచూసిన వార్తలు అందుకుంటారు ఆలోచనలు ఫలిస్తాయి. శత్రువుల మీద విజయం సాధిస్తారు రుణ సంబంధమైన విషయాలు అనుకూలంగా ఉంటాయి నైపుణ్యాలు పెరుగుతాయి. ఆకస్మిక ఖర్చులు దూరంగా ఉండాలి. జీవిత భాగస్వామి కొరకు బహుమానాలు. విదేశీ ప్రయత్నాలు. ఎక్కువ దృష్టి సారించడం వల్ల వృత్తి పిల్లల అభివృద్ధి రెండిటి మధ్య ఘర్షణ అధికంగా ఉంటుంది.   నిద్రలేమి మానసిక ఘర్షణ అధికంగా ఉంటుంది. పుణ్యక్షేత్ర సందర్శన, నది స్నానాలు. ఆధ్యాత్మిక పుణ్య కార్యక్రమముల కొరకు ఖర్చుల అధికంగా ఉంటాయి. మరిన్ని మంచి ఫలితముల కొరకు అరుణాచల శివ శ్లోకము మేలు.


11) కుంభ రాశి...(ధనిష్ట 3 4, శతభిషం 1 2 3 4, పూర్వాభాద్ర 1 2 3  పాదాలు) (నామ నక్షత్రములు: గూ, గే, గో, సా, సి, సు, సే, సో, దా)    వారం ప్రారంభంలోమాటల విభేదాలు రాకుండా జాగ్రత్తగా ఉండాలి. కుటుంబ సభ్యులతో ఘర్షణాత్మకమైన వైఖరి మానసికంగా ఏదో తెలియని నిరాశ గందరగోళం.అన్నదమ్ములతో మాట పట్టింపులు రాకుండా జాగ్రత్త వహించాలి. అనుకోని ఆందోళనలు, ఆకస్మిక ప్రయాణాలు చికాకులు ఇబ్బంది కలిగిస్తాయి. ముఖ్యమైన కార్యక్రమాలు వాయిదా. ఆరోగ్యం ప్రత్యేక శ్రద్ధ. ప్రశాంతత కొరకు మెడిటేషన్ దైవారాధన ఆధ్యాత్మిక ప్రదేశ సందర్శన.  వారం మధ్యలో ఉన్నత విద్య కొరకు ప్రయత్నం చేస్తే విద్యార్థులకు మిత్రుల సహకారంతో అవకాశాలు. జీవిత భాగస్వామి  బంధువుల సహకారంతో  వ్యక్తులకు ప్రయత్నాలు ఫలిస్తాయి. వృత్తిపరమైన విషయాలలో అధికారులతో రాజకీయ నాయకులతో చర్చించి కొత్త నిర్ణయాలు తీసుకుంటారు.  వారం చివరిలో ఆశించిన ఫలితాలు అందుకుంటారు వ్యక్తిగత గౌరవం శ్రద్ధ పెరుగుతాయి, విదేశీ అవకాశాలు. పోటీలలో నెగ్గడం నిర్ణయ సామర్థ్యం పెరగడం. తల్లిదండ్రుల ప్రోత్సాహం ఉంటుంది. భూ విషయాలు అనుకూలంగా ఉంటాయి దూర ప్రదేశాలలో ఉండే ఆత్మీయుల సహకారంతో ఆశించిన విషయాల విజయం సాధిస్తారు. ఉన్నత స్థాయి ఉన్నత అధికారుల పలుకుబడి మాట సహాయంతో వృత్తిపరమైన అభివృద్ధి.మరిన్ని మంచి ఫలితాల కొరకు లలితా సహస్రనామాలు వినడం మేలు.


12) మీన రాశి...(పూర్వాభాద్ర 4,ఉత్తరాభాద్ర 1 2 3 4,రేవతి 1 2 3 4 పాదాలు)(నామ నక్షత్రములు: దీ , దు, ఇ+, ఝ, ధా, దే, దో, చా, చి)ప్రారంభంలోనూతన వ్యక్తులతో వ్యాపార భాగస్వాములతో ఆర్థికపరమైన విషయాలలో ఘర్షణాత్మకమైన పరిస్థితులు రాకుండా జాగ్రత్త పడాలి. అప్పుడే మైత్రి బంధాలు బలపడతాయి, తగిన గుర్తింపు గౌరవం. ఉద్వేగాలు చాలా అధికంగా ఉంటాయి.  ఆరోగ్య విషయంలో శ్రద్ధ తీసుకోవాలి. ముఖ్యంగా పనులు వాయిదా ఆటంకాలు  చికాకును కలిగిస్తాయి మానసిక ప్రశాంతత తగ్గుతుంది. ఆకస్మికమైన ఆధ్యాత్మిక పరమైన ఖర్చులు డొనేషన్లు చారిటబుల్ ట్రస్టుల విషయంలోనూ శుభకార్యాల నిమిత్తం అధికంగా ఉంటాయి. వారం మధ్యలో  ఉద్వేగాలను నియంత్రించుకోవాలి. రోగ నిరోధక శక్తిని పెంచుకుంటూ, యోగ మెడిటేషన్ మొదలైంది చేయడానికి ప్రయత్నం చేయాలి. తదుపరి ఉన్నత విద్య కొరకు ప్రయత్నం చేసే విద్యార్థులకు దూర ప్రయాణాలు మిత్రుల సహకారం కమ్యూనికేషన్ విషయంలో తగిన జాగ్రత్తలు వహించాలి. తండ్రి పెద్దలు మొదలగు వారి ఆశీస్సులు లభిస్తాయి. వారం చివరిలో  వృత్తి విషయం ఘర్షణతో కూడిన సామాన్య ఫలితాలు ఉంటుంది.వృత్తి పరమైన విషయాలు ఆశ జనకంగా ఉంటాయి. ఆర్థిక విషయాలు కొంతవరకు అనుకూలంగా ఉన్నప్పటికీ  ఖర్చులు అధికంగా ఉంటాయి. మరిన్ని మంచి ఫలితాల కొరకు  శ్రీకృష్ణ మందిరాలు దర్శించటమేలు.


(గమనిక: వ్యక్తిగత జాతకము అనగా వ్యక్తి పుట్టి నపుడు అతని సమయం, స్థలం, జన్మ వివరాలు ఆధారముగా నిర్మించిన జన్మకుండలి ప్రకారము వ్యక్తికి నడుస్తున్న దశలు, అంతర్దశలు ప్రధానము. గోచారం ఫలితాలు చూసుకునేటప్పుడు ప్రధానముగా వ్యక్తిగత  జాతకము లోని దశ  అంతర్దశలు కూడా కలిపి చూసుకోవాలి. గోచార రీత్యా రాశి ఫలాలు అశుభము గా ఉండి దోషాలు ఉన్నప్పటికీ, జననకాల దశ ఫలములు శుభము గా ఉంటే  రాశి   ప్రస్తుత అశుభ ఫలితాలు స్వల్పంగానే ఉంటాయి. చిన్న చిన్న పరిహారాలు పాటించి శుభ ఫలితాలు పొందగలరు)


 


డా|| ఈడుపుగంటి పద్మజారాణి


జ్యోతిష్యము & వాస్తు నిపుణురాలు


email : padma.suryapaper@gmail.com


phone : +91 93930 07560, +91 98492 50852


www.padmamukhi.com






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com