హైదరాబాద్ యువత లో స్ట్రోక్ కేసులు ఆందోళనకరంగా పెరుగుతున్నాయి - ఇక్కడ ప్రతి ఏడుగురు స్ట్రోక్ రోగులలో ఒకరు 25-45 సంవత్సరాల మధ్య వయస్సు గలవారు - వెంటనే చికిత్స చేయటం మరియు రీహాబిలిటేషన్ ఇంతకు ముందెన్నడూ లేనంత క్లిష్టంగా మారింది. ఈ పెరుగుతున్న ఆందోళనను తీరుస్తూ, హైదరాబాద్‌లో అంకితమైన ఫిజికల్ మెడిసిన్ మరియు రిహాబిలిటేషన్ బృందంతో మొదటి మరియు ఏకైక ప్రదాత హెచ్‌సిఏహెచ్ , స్ట్రోక్ రికవరీలో ముందస్తు రీహాబిలిటేషన్ యొక్క ప్రాముఖ్యతపై ప్రత్యేక రౌండ్‌టేబుల్ సదస్సును నిర్వహించింది. ఏఐ - ఆధారిత పరికరాల మద్దతుతో న్యూరో రిహాబిలిటేషన్, ఫిజియోథెరపీ మరియు అధునాతన స్ట్రోక్ రికవరీ పద్ధతుల్లో నిపుణుల నుండి వ్యక్తిగతీకరించిన, బహుళ విభాగ సంరక్షణను స్ట్రోక్ రోగులు పొందుతున్నారని నిర్ధారించుకోవడానికి హెచ్‌సిఏహెచ్ సుశిక్షితులైన , ప్రత్యేకమైన పిఎంఆర్ బృందాన్ని పరిచయం చేయటంలో ముందుంది. దీర్ఘకాలిక వైకల్యాన్ని నివారించడానికి, ఆరోగ్య సంరక్షణ ఖర్చులను తగ్గించడానికి మరియు మెరుగైన రోగి ఫలితాల కోసం రోబోటిక్స్ మరియు ఏఐ వంటి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాలను సమగ్రపరచడానికి ముందస్తు పునరావాసం కీలకమని చర్చ నొక్కి చెప్పింది.
స్ట్రోక్ సమస్య తరచుగా వృద్ధులతో ముడిపడి ఉన్నప్పటికీ, ధూమపానం, మద్యపానం, అధిక ఒత్తిడి స్థాయిలు, సరైన ఆహారం లేకపోవడం మరియు శారీరక శ్రమ లేకపోవడం వంటి జీవనశైలి కారకాల కారణంగా యువత ఎక్కువగా ప్రమాదంలో వుంది. అయితే, వైద్య పురోగతి ఉన్నప్పటికీ, భారతదేశ జనాభాలో 25% మందికి మాత్రమే స్ట్రోక్ పరిస్థితులను నిర్వహించటానికి అనువైన ఆసుపత్రులు అందుబాటులో ఉన్నాయి, దీని వలన చాలా మంది రోగులు సకాలంలో చికిత్స పొందలేకపోతున్నారు. హైదరాబాద్‌లోని కిమ్స్ సన్‌షైన్ హాస్పిటల్స్ చీఫ్ న్యూరోసర్జన్ డాక్టర్ నవీన్ మెహ్రోత్రా మరియు సోమాజిగూడలోని యశోద హాస్పిటల్స్ కన్సల్టెంట్ న్యూరోసర్జన్ డాక్టర్ అనంత్ ఎగూర్, ప్రజలకు అవగాహన కల్పించటంతో పాటుగా నిర్మాణాత్మక పునరావాసం యొక్క అత్యవసర అవసరాన్ని నొక్కి చెప్పారు, "స్ట్రోక్ నుండి బయటపడటం మొదటి అడుగు మాత్రమే; నిజంగా కోలుకోవడం అనేది ముందస్తు రీహాబిలిటేషన్ పై ఆధారపడి ఉంటుంది. చాలా మంది రోగులు క్లిష్టమైన దశ ముగిసిన తర్వాత, కోలుకోవడం సహజంగానే జరుగుతుందని భావిస్తారు, కానీ నిర్మాణాత్మక న్యూరోరిహాబిలిటేషన్ లేకపోతే వారు శాశ్వత వైకల్యం యొక్క అధిక ప్రమాదాన్ని ఎదుర్కొంటారు. ప్రత్యేక రీహాబిలిటేషన్ బృందాలు మరియు అధునాతన సాంకేతిక పరిజ్ఞానం మద్దతుతో ముందస్తు జోక్యం, రోగి స్వాతంత్ర్యం తిరిగి పొందడం లేదా సంరక్షకులపై శాశ్వతంగా ఆధారపడటం మధ్య వ్యత్యాసాన్ని కలిగిస్తుంది. బ్రతికి ఉన్నవారు కేవలం జీవించడమే కాకుండా, పూర్తిగా కోలుకుని ఉత్పాదక జీవితాలను గడపాలని నిర్ధారించుకోవడానికి హైదరాబాద్ ప్రత్యేక స్ట్రోక్ రీహాబిలిటేషన్ సేవలకు ప్రాప్యతను ప్రాధాన్యత ఇవ్వాలి" అని అన్నారు.
![]() |
![]() |