ప్రతి ఒక్కరి వంటింట్లో చాలా రకాల వస్తువులు, ఆహార పదార్థాలు ఉంటాయి. ఇవన్నీ కూడా మనం వంటల్లో వాడతాం. అయితే, ప్రతి పదార్థం కూడా ఆరోగ్యాన్ని కాపాడుతుందనే చెప్పలేం. ఎందుకంటే, వాటిని తయారుచేసేటప్పుడు వాడే కొన్ని పదార్థాలు క్యాన్సర్ వంటి ప్రాణాంతక సమస్యల్ని తీసుకొస్తుంది. ఈ వస్తువులు క్యాన్సర్ వంటి ప్రమాదకరమైన సమస్యలతో లింక్ అయి ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. అలాంటి వాటి గురించి తెలుసుకుని వాటిని దూరంగా ఉంచడమే మంచిదని తెలుస్తోంది.
రిఫైండ్ ఆయిల్
మనం వాడే రిఫైండ్ ఆయిల్‌ని చాలా రకాల కెమికల్స్‌తో తయారు చేస్తారు. ఇవన్నీ కూడా బాడీకి చాలా ప్రమాదకరం. సరైనట్లుగా తయారవ్వడానికి ఈ నూనెల్ని హైడ్రోజనేషన్ చేస్తారు. ఇది ట్రాన్స్ ఫ్యాట్స్ ఏర్పడటానికి దారితీస్తుంది. ఈ ట్రాన్స్ ఫ్యాట్స్ కారణంగా లివర్, డయాబెటిస్, ఊబకాయం, జీర్ణశయాంతర వ్యాధులు, క్యాన్సర్, ప్రధానంగా బ్రెస్ట్ క్యాన్సర్, పెద్ద ప్రేగు క్యాన్సర్ వంటి సమస్యలకి కారణమవుతుంది. కాబట్టి, వీటి వాడకాన్ని తగ్గించాలి. వీటి బదులు కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్, సహజ విత్తన నూనెల్ని వాడండి. అవి వేరుశనగనూనె, ఎక్స్‌ట్రా వర్జిన్ ఆలివ్ ఆయిల్, కొబ్బరి నూనె, ఆవాల నూనెల్ని వాడండి. వెన్నని కూడా వాడొచ్చు. అదే విధంగా, నూనెల్ని మళ్లీ మళ్లీ వేడి చేయొద్దు.
పంచదార
ఉదయాన్నే కాఫీ, టీలలో పంచదార వేస్తుంటాం. అలానే జ్యూస్‌లు, స్వీట్ రెసిపీలు, ఇతర వంటకాల్లోనూ కూడా పంచదారని వాడతాం. ఇలా పంచదారని ఎక్కువగా తీసుకోవడం వల్ల బాడీలో క్యాన్సర్ సెల్స్ పెరుగుతాయి. కాబట్టి.. పంచదారని ఎంత వీలైతే అంత దూరంగా ఉంచడం చాలా ఉత్తమం. దీని వల్ల క్యాన్సర్ మాత్రమే కాదు, బరువు పెరగడం, బీపి, షుగర్ వంటి సమస్యల నుంచి ముందుగానే తప్పించుకోవచ్చు.
క్యాన్డ్ ఫుడ్స్
క్యాన్డ్ ఫుడ్స్ కూడా చాలా కన్వీనియెంట్‌గా ఉంటుందని చాలా మంది వాడతారు. కానీ, ఇందులో క్యాన్సర్‌కి కారణమయ్యే బైస్‌ఫోనియా ఉంటుంది. ఇది క్యాన్స్ లైనింగ్‌లో ఉంటుంది. బీపీఏ కూడా ఫుడ్‌లో ఉంటుంది. ముఖ్యంగా క్యాన్స్‌లో వచ్చే ఫుడ్‌లో , అసిడిక్ లాంటి ఫుడ్‌లో ఉంటుంది. ఈ కెమికల్ కారణంగా క్యాన్సర్ వచ్చే రిస్క్ పెరుగుతుంది. కాబట్టి, వీటి బదులు వేరే రకాలైన ఫుడ్స్ తీసుకోవడం మంచిది.
ప్రాసెస్డ్ మీట్
ప్రాసెస్డ్ మీట్ కూడా నేటి కాలంలో చాలా మంది వాడుతున్నారు. దీని వల్ల కూడా క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా కొలొరెక్టల్ క్యాన్సర్ వస్తుంది. ఇందులో ఎక్కువగా నైట్రేట్స్, నైట్రిట్స్ ఉంటాయి. వీటిని తీసుకోవడం వల్ల నైట్రోసామైన్స్ లా కన్వర్ట్ అవుతాయి.దీనిని తీసుకోవడం వల్ల క్యాన్సర్ డెవలప్ అయ్యే ఛాన్స్ ఉంది. దీని బదులు హెల్దీ ప్రోటీన్ సోర్సెస్ తీసుకోండి.
పాలు, పాల పదార్థాలు
ఎక్కువ పాలు రావడానికి చాలా మంది ఆవులు, గేదెలకి హార్మోన్స్‌ని వాడుతున్నారు. ఇవి వాటి పాలలో స్రవించి మన వరకి వస్తున్నాయి. వీటిని తీసుకోవడం వల్ల ఇన్‌ఫెర్టిలిటీ, థైరాయిడ్, ఎండోక్రినల్ సమస్యలు వస్తాయి. కాబట్టి, ఈ పాలు, పాల పదార్థాలను కూడా వాడడం తగ్గించాలి.
అల్యూమినీయం ఫాయిల్
అల్యూమినియం ఫాయిల్‌ని కూడా చాలా రకాలుగా వాడతారు. వీటిని చపాతీలు, రోటీలు ప్యాక్ చేసేందుకు వాడతారు. బయట హోటల్స్‌లో ఫుడ్ ప్యాకేజింగ్‌కి వాడతారు. అయితే, కొన్ని అసిడిక్ ఫుడ్స్‌ని మనం ఈ ఫాయిల్ పేపర్‌లో వండినా, స్టోర్ చేసినా ఇది అల్యూమినీయం పెరగడానికి దారితీస్తుంది. ఇది బాడీలో ఎఫెక్ట్ చూపిస్తుంది. ఎక్కువ రోజులు వాడితే దీని వల్ల కూడా క్యాన్సర్ వచ్చే రిస్క్ పెరుగుతుంది. కాబట్టి, దీనిని వాడకపోవడమే మంచిది.
![]() |
![]() |