జుట్టు అందంగా కనిపించాలని చాలా మందికి ఉంటుంది. దీనిని వాడడం వల్ల చాలా జుట్టుకి సంబంధించిన చాలా సమస్యలు దూరమవుతాయి. జుట్టుని అందంగా, ఆరోగ్యంగా చేసేందుకు ఎన్నో పద్ధతులు ఉన్నాయి. అందులో అలోవెరా కూడా ఒకటి. అలోవెరాలో మినరల్స్, ఎంజైమ్స్, ఫోలిక్ యాసిడ్, విటమిన్స్ ఇతర గుణాలు ఎన్నో ఉన్నాయి. ఇవన్నీ కూడా జుట్టుని హెల్దీగా పెంచుతాయి.
అనేక కారణాల వల్ల కొంతమంది జుట్టు డ్రైగా మారుతుంది. దీనిని షైనీ అండ్ సాఫ్ట్‌గా చేసుకోవాలంటే కొన్ని టిప్స్ ఫాలో అవ్వాలి. అవి కూడా నేచురల్‌గానే ఉండాలనుకుంటే అలోవెరా బెస్ట్ అని చెప్పొచ్చు. అలోవెరాని వాడడం వల్ల కుదుళ్లు బలంగా మారడమే కాదు. జుట్టు ఆరోగ్యం కూడా మెరుగ్గా మారుతుంది. దీంతో పాటు దురద, ఇరిటేషన్ కూడా తగ్గుతుంది. అలోవెరాని వాడడం వల్ల డాండ్రఫ్ తగ్గి హెల్దీగా మారుతుంది. పైగా ఇది pH లెవల్స్‌ని బ్యాలెన్స్ చేస్తుంది. దీనికోసం హెయిర్ మాస్క్‌ని ఎలా తయారు చేయాలో తెలుసుకోండి.
కావాల్సిన పదార్థాలు
2 టేబుల్ స్పూన్ల అలోవెరా జెల్
1 టేబుల్ స్పూన్ తేనె
2 టేబుల్ స్పూన్ కొబ్బరినూనె
2 టీ స్పూన్ ఆపిల్ సైడర్ వెనిగర్
షవర్ క్యాప్
మొత్తం పదార్థాలను కలపడం
ముందుగా పదార్థాలన్నింటిని ఓ గిన్నెలో వేసి బాగా కలపాలి. ఎలాంటి లంప్స్ లేకుండా కలపండి. ఏవైనా ఉంటే దానిని ఓ 5 నిమిషాలు పక్కనపెట్టండి. ఇలా చేయడం వల్ల చిన్న చిన్న గడ్డలుగా ఉన్నా బాగా కలిసిపోతాయి.
అప్లై చేయడం
ఇలా తయారు చేసిన మాస్క్‌ని కుదుళ్ల నుంచి చివర్ల వరకూ బాగా రాయండి. మీకు ఎక్కువగా మాయిశ్చర్ కావాలో అక్కడ అప్లై చేయండి. జుట్టు మొత్తానికి ఇలానే రాయండి. తర్వాత కొప్పులా వేయండి. ఇలా చేస్తే జుట్టు మొత్తానికి మాస్క్ చక్కగా అంటుతుంది.
టవల్‌తో కవర్ చేయడం
జుట్టుని ముడివేశాక దీనిని కవర్ చేస్తూ షవర్ క్యాప్ లేదా, గోరువెచ్చని నీటిలో ముంచి పూర్తిగా పిండిన టవల్‌తో జుట్టుని కవర్ చేయండి. ఇలా చేయడం వల్ల మాయిశ్చర్ మొత్తం జుట్టుకి పడుతుంది. ఇది అప్లై చేశాక ఓ అరగంట నుంచి గంట వరకూ ఉండండి. లేదంటే మీకు వీలైతే రాత్రంతా అలానే ఉండండి.
క్లీన్ చేయడం
ఉదయాన్నే ఈ మాస్క్‌ని చల్లని నీరు, మైల్డ్ షాంపూ, కండీషనర్‌తో క్లీన్ చేయండి. ఇలా చేస్తే జుట్టు మొత్తం క్లీన్ అవుతుంది. కాబట్టి, రెగ్యులర్‌గా ఇలా చేయడం వల్ల జుట్టు అందంగా, ఒత్తుగా పెరుగుతుంది.
బెనిఫిట్స్
మీరు ఈ హెయిర్‌మాస్క్‌ని అప్లై చేసి తలని క్లీన్ చేశాక జుట్టు కుదుళ్లు చాలా స్ట్రాంగ్‌గా ఉన్నట్లుగా ఉంటుంది. దీనిని వారానికి రెండు సార్లు వాడండి. ఇదే మాస్క్‌లో కొద్దిగా ఆలివ్ ఆయిల్ వాడండి. దీంతో మాయిశ్చరైజేషన్ అందుతుంది. అదే విధంగా, ఎసెన్షియల్ ఆయిల్ వేస్తే అరోమా బాగుంటుంది. రెగ్యులర్‌గా అప్లై చేయడం వల్ల జుట్టు షైనీగా ఉంటుంది. మీది ఆల్రెడీ ఆయిలీ జుట్టు అయితే నూనెలు తగ్గించి రాయండి.
![]() |
![]() |