ప్రస్తుత బిజీ లైఫ్‌స్టైల్, అనారోగ్యకర ఆహారపు అలవాట్లతో అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఇందులో బెల్లీ ఫ్యాట్ ముఖ్యమైన సమస్యగా మారింది. చాలా మంది బెల్లీ ఫ్యాట్‌తో బాధపడుతున్నారు. ఒక వ్యక్తి ఆహారపు అలవాట్లు అతని ఆరోగ్యంపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతాయి. ఆహారపు అలవాట్ల కారణంగా అధిక బరువు, బెల్లీ ఫ్యాట్ సమస్యలతో బాధపడుతున్నారు. బెల్లీ ఫ్యాట్ అంటే బొడ్డు చుట్టూ కొవ్వు పేరుకుపోవడం. దీంతో ఈ పొట్ట గుండ్రటి ఆకారంలో కనిపిస్తుంది. బెల్లీ ఫ్యాట్ కారణంగా గుండె, బీపీ, షుగర్ వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది.
ఇక, బెల్లీ ఫ్యాట్‌ను కరిగించడం పెద్ద సవాల్‌గా మారింది. పొట్ట చుట్టూ పేరుకుపోయిన కొవ్వు కరగడానికి చాలా సమయం పడుతుంది. శరీరంలో మిగతా భాగాల కన్నా నెమ్మదిగా కరుగుతుంది. బెల్లీ ఫ్యాట్‌ని కరిగించుకోవాలంటే చాలా కష్టపడాల్సి ఉంటుంది. అయితే, తులసి ఆకులు బొడ్డు కొవ్వును తగ్గించడానికి సహజమైన, ప్రభావవంతమైన నివారణగా పనిచేస్తాయి. యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలతో నిండి ఉన్న తులసి బెల్లీ ఫ్యాట్ తగ్గించడంలో ఎలా సాయపడుతుందో తెలుసుకుందాం.
తులసితో ప్రయోజనాలు
తులసి ఆకుల్లో శరీరానికి మేలు చేసే ఎన్నో పోషకాలు ఉంటాయి. తులసి ఆకుల్లో యాంటీ బ్యాక్టీరియల్, క్రిమినాశక మూలకాలు ఉంటాయి. తులసిని ఆయుర్వేదంలో అనేక విధాలుగా ఉపయోగిస్తారు. తులసిలో యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ, జీవక్రియను పెంచే లక్షణాలు ఉన్నాయి. తులసి ఆకులు శరీరం నుంచి విషాన్ని బయటకు పంపడంలో సాయపడుతుంది. బరువు తగ్గించే ప్రక్రియను వేగవంతం చేస్తుంది. తులసి ఆకులలో ఉండే ఫైటోన్యూట్రియెంట్లు శరీర కొవ్వును కరిగించి శక్తిగా మార్చడంలో సహాయపడతాయి. తులసి ఆకులతో బెల్లీ ఫ్యాట్‌ని ఎలా తగ్గించుకోవచ్చో తెలుసుకుందాం.
తులసి టీ
తులసి టీ తాగడం వల్ల జీవక్రియ పెరుగుతుంది. బెల్లీ ఫ్యాట్‌ని బర్న్ చేసే ప్రక్రియ వేగవంతం అవుతుంది. తులసి టీ కకోసం ముందుగా 8-10 తులసి ఆకుల్ని నీటిలో మరిగించండి. అందులో కొంచెం తేనె, నిమ్మరసం కలిపి తాగవచ్చు. ఈ టీ బరువు తగ్గడానికి సాయపడటమే కాకుండా జీర్ణవ్యవస్థను బలోపేతం చేస్తుంది.
తులసి, తేనె
తులసి ఆకుల నుంచి రసం తీసి, దానికి తేనె కలిపి ఉదయాన్నే ఖాళీ కడుపుతో తీసుకోవాలి. ఈ కాంబినేషన్ శరీరం నుంచి టాక్సిన్లను తొలగిస్తుంది. అంతేకాకుండా బెల్లీ ఫ్యాట్‌ని బర్న్ చేయడానికి సాయపడుతుంది. దీన్ని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల పొట్ట దగ్గర కొవ్వు తగ్గుతుందని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు.
తులసి, అల్లం కషాయం
తులసి ఆకులు, అల్లంను నీటిలో మరిగించి కషాయం చేసుకోండి. రుచి కోసం కావాలంటే కాస్త తేనె కలపండి. ఈ డ్రింక్ తాగితే జీవక్రియ పెరుగుతుంది. అంతేకాకుండా బొడ్డు కొవ్వును తగ్గించడంలో సాయపడుతుంది. ప్రతి రోజూ ఈ డ్రింక్ తాగితే శరీరానికి ఎంతో మేలు జరుగుతుంది.
తులసి ఆకుల్ని నమలడం
ప్రతి ఉదయం ఖాళీ కడుపుతో 4-5 తులసి ఆకుల్ని నమలడం కూడా బెస్ట్ అంటున్నారు నిపుణులు. దీన్ని వల్ల బొడ్డు కొవ్వు కరుగుతుంది. తులసి ఆకులు జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. అంతేకాకుండా శరీరంలో నిల్వ ఉన్న అదనపు కొవ్వు తగ్గుతుంది.
తులసి, దాల్చిన చెక్క నీరు
తులసి ఆకులు, దాల్చిన చెక్కను నీటిలో మరిగించి తాగితే శరీరానికి ఎంతో మేలు జరుగుతుంది. ఈ నీరు శరీర జీవక్రియను వేగవంతం చేస్తుంది. బొడ్డు కొవ్వును తగ్గించడంలో ప్రభావవంతంగా ఉంటుంది. తులసిని తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తిని బలపడుతుంది. కొలెస్ట్రాల్‌ని తగ్గించడంలో సాయపడుతుంది. తులసి ఆకులు రోజూ తీసుకుండే ఒత్తిడి కూడా తగ్గుతుంది.
![]() |
![]() |