ఆర్మ్ ఫ్యాట్.. అంటే భుజాల దగ్గర ఫ్యాట్ పేరుకుపోవడం దీంతో చూడ్డానికి చేతులు చాలా లావుగా కనిపిస్తాయి. కొంతమందికి ఈ ఫ్యాట్ పేరుకుపోయి భుజాల కింద మరీ వేలాడినట్లుగా ఉంటుంది. చూడ్డానికి పెద్దవారిలా కనిపిస్తాయి. అలాంటప్పుడు కొన్ని ఎక్సర్‌సైజెస్ చేయడం వల్ల ఆర్మ్ ఫ్యాట్ తగ్గుతుంది. బరువు తగ్గితే ఆటోమేటిగ్గా ఫ్యాట్ కూడా తగ్గుతారు. కొంతమందికి బెల్లీ ఫ్యాట్, నడుము సన్నబడడంపైనే దృష్టి ఉంటుంది. కానీ, ఫ్యాట్ పెరిగిన చేతులు కూడా అందాన్ని కూడా తగ్గిస్తుంది. కాబట్టి, కొన్ని వర్కౌట్స్ చేయొచ్చు. వీటిని రెగ్యులర్‌గా చేస్తే నాలుగు రోజుల నుంచే రిజల్ట్ కనిపిస్తుంది.
ఆర్మ్ సర్కిల్
ఆర్మ్ సర్కిల్ ఎక్సర్‌సైజ్ చేయడానికి మీ చేతులని వెడల్పుగా పెట్టి పెద్దగా గుండ్రంగా తిప్పండి. ఈ వర్కౌట్ చేయడం వల్ల భుజాలు, కండరాలను టోన్ చేస్తుంది. ఫ్లెక్సిబిలిటీ పెరుగుతుంది. రక్తప్రసరణని మెరుగ్గా చేస్తుంది. రెగ్యులర్‌గా చేస్తే మంచి రిజల్ట్ ఉంటుంది.
చేతులు ఊపడం
రెండు చేతులను ప్రక్కలకి చాపి చిన్న చిన్న కదిలిస్తూ పైకి క్రిందకి కదిలించడం. ఇది రక్తప్రసరణని మెరుగ్గా చేస్తుంది. కండరాల బలాన్ని పెంచుతుంది. చేతులని టోన్ చేస్తుంది. రెగ్యులర్‌గా చేస్తే చాలా మంచి రిజల్ట్ ఉంటుంది.
షాడో బాక్సింగ్
దీనిని చేయడం కూడా ఈజీనే. గాలిలో పంచ్ వేయడమే. ఇది చాలా ఫన్నీగా ఉండే ఎక్సర్‌సైజ్. లైట్ కార్డియో వర్కౌట్. ఇది చేతులను టోన్ చేస్తుంది. రక్తప్రసరణని పెంచుతుంది. పైభాగాన్ని బలంగా చేస్తుంది. బాక్సింగ్‌లానే చేయాలి. కానీ, గాల్లో చేయాలి. ఇలా చేయడం వల్ల కూడా చాలా వరకూ ఆర్మ్ ఫ్యాట్ తగ్గుతుంది.
ట్రైసెప్స్ డిప్స్
స్ట్రాంగ్ కుర్చీపై చేతులు పెట్టి శరీరాన్ని పైకి క్రిందకి కదిలించండి. ఇది ముఖ్యంగా ట్రైసెప్స్‌ని టోన్ చేస్తుంది. చేతుల్లో వదులుగా ఉన్న చర్మాన్ని టైట్ చేయడానికి సాయపడుతుంది. ఇది మనకి పార్కుల్లో ఉన్న బల్లలు, బెంచీలపై కూడా చేయొచ్చు. దీని వల్ల చేతులు చక్కగా టోన్ అవుతాయి.
వాల్ పుషప్స్
గోడకు ఎదురుగా నిలబడి చేతులతో నెట్టడం ద్వారా శరీరాన్ని ముందుకు వెనక్కి కదిలించండి. ఈ ఈజీ వర్కౌట్ చేయడం వల్ల చేతులు బలంగా మారతాయి. అప్పర్ బాడీ బలంగా మారుతుంది. ఎక్స్‌ట్రా ఫ్యాట్ బర్న్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది.
బరువు లేకుండా బైసెప్ కర్ల్స్
పిడికిలి బిగించి, డంబెల్ ఎత్తినట్లుగా ఎత్తండి. ఈ వర్కౌట్ కండరపు తొడలను బలపరుస్తుంది. కండరాల నిర్మాణాన్ని మెరుగ్గా చేస్తుంది. కీళ్లపై ఎక్కువ ఒత్తిడిని కలిగించకుండా చేతులని టోన్ చేస్తుంది.
![]() |
![]() |