జనసేనను రానున్న రోజుల్లో మరింత బలమైన పార్టీగా నిర్మాణం చేస్తామని ఆ పార్టీ అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. పిఠాపురం నియోజకవర్గం చిత్రాడలో నిర్వహించిన ‘జయకేతనం’ ఆవిర్భావ సభ విజయవంతం అయ్యేందుకు కృషి చేసిన ప్రతి ఒక్కరికీ బుధవారం ‘ఎక్స్’లో ఆయన ధన్యవాదాలు తెలియజేశారు. భవిష్యత్‌లో తమ పార్టీ సామాన్యుల గొంతుకగా మారుతుందని, రాష్ట్ర ప్రయోజనాలు, జాతీయ ఐక్యత లక్ష్యంగా, మరింత బాధ్యతతో పనిచేసే దిశగా అడుగులు వేయనుందని తెలిపారు. జనసేన 11 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణం పూర్తి చేసుకుని.. 12వ ఆవిర్భావ దినోత్సవం జరుపుకొన్న సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసిన టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబుకు, మంత్రి లోకేశ్‌కు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు, ఎంపీ పురందేశ్వరికి, ఎన్డీయే నాయకులు, చిత్ర పరిశ్రమ మిత్రులు, శ్రేయోభిలాషులకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలిపారు.
![]() |
![]() |