ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఉద్యోగులతో బిలియనీర్ వింత ఒప్పందం

international |  Suryaa Desk  | Published : Mon, Mar 24, 2025, 07:35 PM

వయసు తగ్గించుకోడానికి కోట్లాది రూపాయలు ఖర్చు చేసి.. జన్యుపరమైన చికిత్స తీసుకుంటోన్న అమెరికాకు చెందిన వ్యాపారవేత్త బ్రెయిన్ జాన్సన్ తాజాగా వివాదంలో చిక్కుకున్నారు. తన వింత ప్రవర్తన గురించి బయటపెట్టకుండా ఉండేందుకు తన స్టార్టప్ సంస్థ బ్లూప్రింట్‌లోని ఉద్యోగులతో ఒప్పందాలపై సంతకాలు చేయించుకున్నారనేది ప్రధాన ఆరోపణ. 47 ఏళ్ల జాన్సన్ కొన్నిసార్లు పొట్టి దుస్తులు వేసుకుంటాడని, లోదుస్తులు కూడా వేసుకోకుండా ఉంటాడని, లైంగిక కార్యకలాపాల గురించి మాట్లాడుతుంటాడని, అంగస్తంభనల గురించి కూడా చర్చిస్తుంటాడని న్యూయార్క్ టైమ్స్ సంచలన కథనం ప్రచురించింది.


ఈ ప్రవర్తన తమకు ఇబ్బందికరంగా లేదని, అసభ్యంగా లేదని, అవమానకరంగా లేదని, కవ్వింపుగా లేదని, వృత్తికి తగినట్లుగా ఉందని ఉద్యోగులు అంగీకరించాల్సి ఉంటుందని ఆ కథనం పేర్కొంది. అయితే ఈ ఒప్పందం సరైందేనిని జాన్సన్ సమర్ధించుకోవడం గమనార్హం. ఉద్యోగులతో రహస్య ఒప్పందం చేసుకున్నారని, అందులో చాలా నిబంధనలు ఉన్నాయని కథనం ఆరోపించింది. కురుచ దుస్తులు వేసుకుని తిరుగుతూ, మహిళా ఉద్యోగులతో సరసాలు ఆడతుంటారని ఆ పత్రిక తెలిపింది. ఈ ఒప్పందం వల్ల ఎవరూ ఆయనపై ఫిర్యాదు చేయలేకపోయారని పేర్కొంది.


జాన్సన్ తన వృద్ధాప్యాన్ని వెనక్కి తిప్పే ప్రయోగాల కోసం ఏటా 2 మిలియన్ డాలర్లు (రూ.17 కోట్లు) ఖర్చు చేస్తున్న విషయం తెలిసిందే. అయితే, న్యూయార్క్ టైమ్స్ తన గురించి తప్పుడు కథనం రాసిందని జాన్సన్ ఆరోపించారు. కానీ, ఆ కథనం తన ప్రొఫైల్ లాగా ఉందని వ్యాఖ్యానించాడు. తన గురించి తప్పుగా రాయడానికి ప్రయత్నించింది, కానీ అది తన గురించి మంచిగా రాసినట్లు అయిందని ఎక్స్ (ట్విట్టర్)లో జాన్సన్ పోస్ట్ పెట్టారు..


బ్లూప్రింట్‌లో చేరేటప్పుడు ఒక ఒప్పందంపై సంతకం చేయాల్సి ఉంటుంది. దీని గురించి జాన్సన్ మాట్లాడుతూ.. ‘నేను సోషల్ మీడియాలో నా నగ్న ఫోటోలను పోస్ట్ చేస్తాను.. రాత్రిపూట నా అంగస్తంభనలను ట్రాక్ చేస్తాను. నా వీర్యం ఆరోగ్యం గురించి నా జట్టు బహిరంగంగా చర్చిస్తాను... మేము మీమ్స్ కూడా చేస్తాము. ప్రజలు గుడ్డిగా అనుసరించకుండా మేము ఈ విషయాన్ని ముందుగానే లిఖితపూర్వకంగానే తెలియజేస్తాం. దీనివల్ల ఎవరికీ ఆశ్చర్యం కలగదు’ అని అన్నాడు.


అంతేకాదు ‘ఇది ఎవరినీ బలవంత పెట్టడం కాదు. ఇది పారదర్శకత. ఈ విధానం అందరికీ సరైంది. ఇది అందరి ప్రయోజనాలను కాపాడుతుంది.. మా సంస్కృతికి ఎవరైనా సరిపోకపోతే వారు వేరే చోట పనిచేయవచ్చు.. ఎవరూ బలవంతంగా సంతకం చేయాల్సిన అవసరం లేదు. ఈ ఒప్పందం సంస్థ వాతావరణాన్ని అర్థం చేసుకుని, అంగీకరించడానికి మాత్రమే. ఇది అస్పష్టతను తొలగిస్తుంది. అపార్థాలను నివారిస్తుంది’ అని జాన్సన్ చెప్పుకొచ్చారు.


అయితే, గత పదేళ్లలో కనీసం రెండు డజన్ల మందితో జాన్సన్ రహస్య ఒప్పందాలు చేసుకున్నాడని న్యూయార్క్ టైమ్స్ చేసిన ఆరోపణలపై కూడా ఆయన స్పందించారు. ఈ ఒప్పందాలు సాధారణమైనవేనని అన్నారు. అంతేకాదు, న్యూయార్క్ టైమ్స్‌లో పనిచేసే ఉద్యోగులు కూడా ఇలాంటి ఒప్పందాలపై సంతకం చేస్తారని వివరించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com