గుంటూరు జిల్లాలో దారుణం జరిగింది. వట్టి చెరుకూరులో చెరువులో దిగి పదో తరగతి విద్యార్థి కిషోర్ మృతి చెందాడు. బీసీ వసతి గృహంలో నీరు లేకపోవడంతో నీటి కోసం గురువారం ఉదయం చెరువుకు ముగ్గురు విద్యార్థులు వెళ్లారు. అందులో ఓ విద్యార్థి చెరువులోకి జారి పోయాడు. ఆ విద్యార్దిని కాపాడేందుకు తోటి విద్యార్థులు ప్రయత్నించారు. స్నేహితుడిని కాపాడే ప్రయత్నంలో ఆ ఇద్దరు విద్యార్థులు కూడా చెరువులోకి జారీపోయారు. గమనించిన గ్రామస్తులు ఇద్దరు విద్యార్థులను కాపాడారు. కాగా కిషోర్ అనే విద్యార్థి చెరువులో మునిగిపోయి మృతి చెందాడు. కిషోర్‌ది వెల్దుర్తి మండలం, గంగలకుంట గ్రామం. విషయం తెలుసుకున్న మృతుని కుటుంబసభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు. విద్యార్జి మృతితో ఆ గ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి.
![]() |
![]() |