సంపన్న భారతీయుల సంఖ్య గణనీయంగా పెరుగుతున్న నేపథ్యంలో, భారతదేశంలోని మెగా నగరాల్లో సగటు ఆస్తి ధరలు నిరంతర తీవ్రతతో పెరుగుతున్నాయని ఆల్-ఇండియా హౌసింగ్ ప్రైస్ ఇండెక్స్ 2024 తెలిపింది. భారతదేశంలో అధిక సంపన్నుల మరియు అత్యధిక సంపన్నుల సంఖ్య ప్రతి సంవత్సరం 12% సమగ్ర వార్షిక వృద్ధి రేటు తో వేగంగా పెరుగుతున్న ప్రస్తుత సందర్భంలో, పెద్ద స్థాయిలో నిర్మితమైన ప్రీమియం ప్రాపర్టీలకు ఉన్న డిమాండ్ సాదారణ గృహ అవసరాలకు మించి కొనసాగుతోందని ఇండెక్స్ తెలియజేస్తుంది. ఇంతకు ముందు ఎన్నడూ లేనంతగా విస్తరిస్తున్న వాణిజ్య అవకాశాలు బెంగళూరు మరియు హైదరాబాద్‌ను దేశంలోని అగ్రశ్రేణి ఐటీ కేంద్రాలుగా నిలిపి, వరుసగా ఇండెక్స్‌లో రెండో మరియు మూడో స్థానాల్లో ఉండేలా చేశాయి.
"ధరల స్థిరీకరణ ప్రపంచంలోని ఐదవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థకు వృద్ధి మరియు సంపన్నత కథను తెలియజేస్తోంది. అయితే, ఇవి భారత మధ్య తరగతి ప్రజలపై పెరుగుతున్న ఆర్థిక భారం సూచించే సంకేతాలు కూడా. రియల్ ఎస్టేట్ సమతుల్య వృద్ధిని కొనసాగించాలంటే, గృహాల అందుబాటు అనివార్యంగా మారుతుంది. ఇప్పటికే 2025-26 కేంద్ర బడ్జెట్లో ప్రకటించిన అధిక పన్ను మినహాయింపులు మరియు వడ్డీ రేట్ల సడలింపులు గృహ మార్కెట్‌కు ఊతమిస్తుండగా, జియో-పొలిటికల్ (భౌగోళిక-రాజకీయ) సమస్యలు నిర్మాణ ఖర్చులను మరింత పెంచే ప్రమాదం ఉంది," అని హౌసింగ్.కామ్ & ప్రాప్‌టైగర్.కామ్ గ్రూప్ సీఈఓ శ్రీ ధ్రువ్ అగర్వాలా పేర్కొన్నారు.
"తాజా హౌసింగ్ ప్రైస్ ఇండెక్స్ ప్రకారం, 2024 చివరి త్రైమాసికంలో దేశవ్యాప్తంగా గృహ ధరలు స్థిరంగా ఉన్నాయి," అని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ లో ఆర్థికశాస్త్రం మరియు ప్రజా విధానాల అసిస్టెంట్ ప్రొఫెసర్ శ్రీ శేఖర్ తోమర్ పేర్కొన్నారు. "3బిహెచ్ కె విభాగం స్థిరమైన ధరల పెరుగుదల చూపుతుండగా, దీని ప్రధాన కారణం పెద్ద ఇళ్లకు కొనసాగుతున్న డిమాండ్. దీనికి విరుద్ధంగా, 1 బిహెచ్ కె మార్కెట్ మందగించిపోతోంది, అక్కడ అమ్మకాలు మరియు ధరలు రెండూ తగ్గుతున్నాయి. ఇది ఖర్చు పరిమితి గల గృహ కొనుగోలుదారుల నుంచి డిమాండ్ తగ్గిందని, లేదా విస్తృత స్థలమున్న ప్రాపర్టీల వైపు కొనుగోలుదారుల అభిరుచులు మారుతున్నాయని సూచించవచ్చు," అని శ్రీ తోమర్ విశ్లేషించారు.
![]() |
![]() |