2025 IPl లో భాగంగా చెపాక్ వేదికగా చెన్నై సూపర్ కింగ్స్ vs రాయల్ చాలెంజర్స్ బెంగుళూరు తలపడుతున్నాయి. తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ 20 ఓవర్లలో 7 వికెట్లకు 196 పరుగులు చేసింది. కెప్టెన్ రజత్ పటిదార్ (32 బంతుల్లో 51; 4 ఫోర్లు, 3 సిక్సర్లు) అర్ధ సెంచరీతో రెచ్చిపోయాడు. ఫిల్ సాల్ట్ (16 బంతుల్లో 32; 5 ఫోర్లు, 1 సిక్స్) మెరుపులు మెరిపించాడు. విరాట్ కోహ్లీ (30 బంతుల్లో 31; 2 ఫోర్లు, 1 సిక్స్) నెమ్మదిగా ఆడాడు. చివర్లో టిమ్ డేవిడ్ (8 బంతుల్లో 22 నాటౌట్, ఫోర్, 3 సిక్సర్లు) ధాటిగా ఆడటంతో ఆర్సీబీ భారీ స్కోరు సాధించింది. చెన్నై బౌలర్లలో నూర్ అహ్మద్ 3 వికెట్లతో సత్తా చాటాడు. మతీశ పతిరణకు 2 వికెట్లు దక్కాయి.
టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన ఆర్సీబీకి మెరుపు ఆరంభం దొరికింది. ఫిల్ సాల్ట్ ఆర్సీబీ ఇన్నింగ్స్ ను దూకుడుగా ఆరంభించాడు. అయితే ధోని అద్భుత స్టంపింగ్ కు అవుటయ్యాడు. అనంతరం వచ్చిన పడిక్కల్ (27) కూడా ధాటిగా ఆడాడు. దాంతో ఆర్సీబీ ఓవర్ కు 10 లేదా 9 చొప్పున పరుగులు రాబడుతూ ముందుకు సాగింది. పడిక్కల్ అవుటయ్యాక వచ్చిన కెప్టెన్ పటిదార్ కూడా వేగంగా ఆడాడు. అయితే కోహ్లీ మాత్రమే కాస్త ఇబ్బంది పడ్డాడు. నూర్ అహ్మద్ బౌలింగ్ లో భారీ షాట్ కు ప్రయత్నించి కోహ్లీ అవుటయ్యాడు.
March 28, 2025
![]() |
![]() |