బీహార్‌లోని ఔరంగాబాద్ జిల్లాలో భయానక ఘటన వెలుగుచూసింది. సంతానం కోసం ఓ వ్యక్తిని నరబలి ఇచ్చారు. సుధీర్ పాశ్వాన్ అనే వ్యక్తి తనకు సంతానం కలిగేలా పూజలు చేయాలని రిక్యాస్, ధర్మేంద్రను ఆశ్రయించాడు. ఈ క్రమంలో వీరిద్దరూ నరబలి ఇవ్వాలని నిర్ణయించుకొని యుగుల్ యాదవ్ (65)ను కిడ్నాప్ చేసి తల నరికారు. తర్వాత ఆ తలను హోలీ మంటల్లో కాల్చేశారు. యాదవ్ మిస్సింగ్‌పై ఫిర్యాదు అందగా విచారణలో ఈ హత్య విషయాలు బయటపడ్డాయి.ధర్మేంద్ర తాను, ఇతరులు కలిసి చేతబడి ఆచారాల్లో భాగంగా యుగల్‌ని కిడ్నాప్ చేసి, అతడి తల నరికినట్లు అంగీకరించాడు. ఆ తర్వాత హోలీ మంటల్లో మొండాన్ని కాల్చి వేసినట్లు చెప్పాడు. ధర్మేంద్ర స్టేట్మెంట్ ఆధారంగా సమీపంలోని పొలం నుంచి బాధితుడి తెగిపోయిన తలను స్వాధీనం చేసుకున్నారు. సంతానం కోసం చూస్తున్న సుధీర్ పాశ్వాన్ తరుపున రామశిక్ రిక్యాస్ ఈ కర్మను నిర్వహించినట్లు విచారణలో వెల్లడైంది. ఈ నిందితులు గతంలో ఒక యువకుడిని బలి ఇచ్చినట్లు, అతడి మృతదేహం అదే ప్రాంతంలోని బావిలో పడేసినట్లు ధర్మేంద్ర అంగీకరించాడు. సుధీర్ పాశ్వాన్, ధర్మేంద్ర, మరో ఇద్దరు సహా మొత్తం నలుగురిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ సంఘటనకు సంబంధించి ఒక మైనర్ బాలుడిని కూడా అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు. తాంత్రికుడు రామశిక్ రిక్యాసన్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. మానవ ఎముకల్ని డీఎన్ఏ పరీక్షల కోసం పంపారు.
![]() |
![]() |