2025 IPLలో భాగంగా 15వ మ్యాచ్ కోల్‌కతా నైట్ రైడర్స్ వర్సెస్ సన్‌రైజర్స్ హైదరాబాద్ మధ్య ఈడెన్ గార్డెన్స్ స్టేడియంలో జరుగుతోంది. ఈ క్రమంలో టాస్ గెలిచిన హైదరాబాద్ బౌలింగ్ ఎంచుకుంది. కోల్‌కతా ముందు బాటింగ్ కి దిగింది. KKR ఓపెనర్లను పెవీలియన్ కు పంపంది. మంచి ఫామ్ లో ఉన్న క్వింటన్ డికాక్ ను పాట్ కమ్మిన్స్ ఔట్ చేయగా.. సునీల్ నరైన్ ను మహమ్మద్ షమీ పెవీలియన్ కు పంపాడు. ఆ తర్వాత వచ్చిన అజింక్య రహానే, రఘువంశీతో కలిసి స్కోర్ బోర్డును చక్కబెట్టే పనిలో పడ్డారు. KKRకు మంచి పార్ట్ నర్షిప్ అందించారు. ఇక చివర్లో వెంకటేశ్ అయ్యర్, రింకూ సింగ్ బౌండరీల మోతతో టీమ్ స్కోర్ ను పరుగులు పెట్టించారు. వెంకటేశ్ అయ్యర్ కేవలం 29 బంతుల్లో 60 పరుగుల చేశాడు. ఇందులో 7 ఫోర్లు, 3 భారీ సిక్సులు బాదడం విశేషం. 20 ఓవర్లలో 200 భారీ స్కోర్ చేసింది KKR. చూడాలి SRH ఈ లక్ష్యాన్ని ఛేదిస్తుందో లేదో..
![]() |
![]() |