ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. సోషల్ మీడియా ఎక్స్ (ట్విట్టర్)ను విక్రయించినట్టు మస్క్ ప్రకటించారు. అయితే బయట వ్యక్తులకు మాత్రం కాదు.. మస్క్ ఏఐ స్టార్టప్ కంపెనీ ‘ఎక్స్ ఏఐ’కు విక్రయించడం గమనార్హం. ఈ మేరకు ఎక్స్‌లో మస్క్ పోస్ట్ చేశారు. మొత్తం 33 బిలియన్ డాలర్ల (అంటే 2.80 లక్షల కోట్లు)కు ఎక్స్‌ను అమ్మేసినట్లు పేర్కొన్నారు. దీంతో ప్రస్తుతం ఎక్స్ ఏఐ విలువను 80 బిలయన్ డాలర్లుగా మస్క్ తెలిపారు. అధునాత ఏఐ టెక్నాలజీని ఎక్స్‌కు అనుసంధానం చేయడం ద్వారా ఉత్తమ ఫలితాలు సాధించవచ్చని మస్క్ తన పోస్టులో తెలిపారు.
‘ఎక్స్ ఏఐ’ను రెండేళ్ల కిందటే ఎలాన్ మస్క్ ప్రారంభించారు. ప్రస్తుతం ఎక్స్‌కు 600 మిలియన్ల మంది యూజర్ల ఉన్నారు. ‘ఈరోజు మేము అధికారికంగా డేటా, మోడల్స్, కంప్యూట్, డిస్ట్రిబ్యూషన్, ప్రతిభను అనుసంధానం చేయడానికి అడుగు వేస్తున్నాం.. ఇది ప్రపంచాన్ని ప్రతిబింబించడమే కాకుండా మానవ పురోగతిని మరింత వేగవంతం చేసే సమర్ధవంతమైన వేదికను నిర్మించడానికి మాకు వీలు కల్పిస్తుంది.’ అని మస్క్ పేర్కొన్నారు.
కాగా, 2022లో ట్విట్టర్‌ను 44 బిలియన్ డాలర్లకు మస్క్ కొనుగోలు చేశారు. ఆ తర్వాత ఏడాది ఎక్స్‌ఏఐను కొనుగోలు చేశారు. ఈ వెంచర్ కోసం హై-ఎండ్ Nvidia చిప్‌ల కోసం బిలియన్ల డాలర్లు ఖర్చుచేశారు. కాగా, xAI ఫిబ్రవరిలో చాట్‌బాట్.. గ్రోక్ 3 వెర్షన్‌ను విడుదల చేసింది. ChatGPT,డీప్‌సీక్ వంటి ఏఐ టూల్స్‌కు ధీటుగా గ్రోక్ నిలుస్తుందని మస్క్ భావిస్తున్నారు.
ఓపెన్ఏఐకి చెందిన చాట్‌జీపీటీ, చాట్‌బాట్‌లను కూడా గ్రోక్ వెనక్కి నెడుతుందని మస్క్ ఆశిస్తున్నారు. 2015లో సామ్-ఆల్టమస్‌తో కలిసి మస్క్ ఓపెన్‌ఏఐను ప్రారంభించారు. కానీ, అభిప్రాయబేధాలతో అందులోని మస్క్ బయటకు వచ్చారు. ఆయన బయటకు వచ్చిన మూడేళ్ల తర్వాత ప్రపంచ టెక్నాలజీ రంగంలో సంచలనంగా మారిన చాట్‌జీపీటీని OpenAI ఆవిష్కరించింది. ఇప్పుడు దీనికి పోటీగా ఎలాన్ మస్క్ ఎక్స్ఏఐను ప్రారంభించి.. గ్రోక్ 3ను తీసుకురావడం గమనార్హం. దీనిని మరింత మెరుగుపరిచే పనిలో ఉన్నారు.
![]() |
![]() |