తెలుగుదేశం పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. ఉగాది పర్వదినం సందర్భంగా చంద్రబాబు నాయుడు సోషల్ మీడియా వేదికగా తెలుగు ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు.విశ్వవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలందరికీ విశ్వావసు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలుపుతున్నానని ఆయన అన్నారు. రాబోయే రోజులన్నీ మంచి రోజులనే సానుకూల దృక్పథంతో నూతన సంవత్సరానికి స్వాగతం పలుకుదామని, కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుడదామని ఆకాంక్షించారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రతి ఒక్కరూ రాబోయే కాలంలో గణనీయమైన ప్రగతి సాధించాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నానని ఆయన పేర్కొన్నారు.విశ్వావసు నామ సంవత్సరం తెలుగు ప్రజలందరి జీవితాల్లో సంతోషాన్ని నింపాలని, సకల విజయాలను చేకూర్చాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నానని చంద్రబాబు నాయుడు తెలిపారు.
![]() |
![]() |