ఓ డెలివరీ బాయ్ త్రుటిలో పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. శనివారం రాత్రి 10.30 గంటల సమయంలో ఓ డెలివరీ బాయ్ స్కూటర్‌పై వెళుతుండగా, ఒక్కసారిగా భారీ చెట్టు కూలిపోయింది. సరిగ్గా అదే సమయంలో ఆ మార్గం గుండా వెళుతున్న డెలివరీ బాయ్ క్షణాల్లో స్పందించి తప్పించుకున్నాడు. వెన్ను జలదిరించే ఈ ఘటన మహారాష్ట్రలోని విరార్ ప్రాంతంలో చోటు చేసుకుంది. ఈ దృశ్యాలు అక్కడి సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి. చెట్టు కొమ్మలు పడటంతో డెలివరీ బాయ్‌కు స్వల్ప గాయాలయ్యాయి.
![]() |
![]() |