కోడుమూరు పట్టణంలో వెలసిన వల్లెలాంబదేవి అమ్మవారి రథోత్సవం ఆదివారం అంగరంగ వైభవంగా నిర్వహించారు. పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చి, అమ్మవారి రథాన్ని నామస్మరణతో లాగారు. ఉత్సవానికి ముందుగా, భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. కోడుమూరు ఎస్సై శ్రీనివాసులు తమ పోలీసు సిబ్బందితో కలిసి గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. వివిధ రాజకీయ పార్టీల నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొని, ప్రత్యేక పూజలు నిర్వహించారు.
![]() |
![]() |