ఐపీఎల్‌లో ముంబయి ఇండియన్స్ స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా బౌలింగ్‌ను ఎదుర్కోవడానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆల్‌రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి తెలిపాడు. బుమ్రా ప్రపంచంలోనే అత్యుత్తమ బౌలర్లలో ఒకడని, అతని బౌలింగ్‌లో పరుగులు రాబట్టడానికి ప్రయత్నిస్తానని నితీశ్ అన్నాడు. "బుమ్రా బౌలింగ్‌లో కొన్ని పరుగులు చేయగలిగితే నేను చాలా సంతోషిస్తాను. అతను ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యుత్తమ బౌలర్లలో ఒకడు. అతనితో పోటీ పడటం వల్లే ఆట మరింత ఉత్సాహంగా ఉంటుంది" అని నితీశ్ తెలిపాడు.విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ వంటి దిగ్గజాల వల్లే ఈ తరం భారత క్రికెట్ రూపుదిద్దుకుందని నితీశ్ కొనియాడాడు. వారంతా భారత క్రికెట్‌ను కొత్త శిఖరాలకు తీసుకెళ్లారని, వారి వారసత్వాన్ని ముందుకు తీసుకువెళ్లాలని ఆశిస్తున్నట్లు చెప్పాడు. బుమ్రా ప్రస్తుతం బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో గతంలో నేషనల్ క్రికెట్ అకాడమీ వెన్ను గాయానికి చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే.అంతేకాకుండా, ఎంఎస్ ధోని నుండి కెప్టెన్సీ నైపుణ్యాలను, కోహ్లీ నుంచి దూకుడును, రోహిత్ నుంచి పుల్ షాట్‌ను నేర్చుకోవాలనుకుంటున్నానని నితీశ్ తెలిపాడు. ఇక సన్ రైజర్స్ టీమ్ లో అభిషేక్ శర్మతో పోటీ పడాలని ఉందని, నెట్స్‌లో ఒకరికొకరు సవాళ్లు విసురుకుంటామని నితీశ్ పేర్కొన్నాడు.సన్‌రైజర్స్ హైదరాబాద్ ఇవాళ ఈడెన్ గార్డెన్స్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ కోల్‌కతా నైట్ రైడర్స్‌తో తలపడనుంది.
![]() |
![]() |