ఐపీఎల్ 2025లో తన తొలి మ్యాచ్‌లో భారీ విజయం సాధించిన సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్‌హెచ్) ఆ తర్వాత గాడి తప్పింది. ఆ తర్వాత ఆడిన మూడు మ్యాచుల్లోనూ ఘోర పరాజయం పాలైంది. ఎల్ఎస్‌జీపై 5 వికెట్లు, డీసీపై 7 వికెట్లు, నిన్న కేకేఆర్ చేతిలో 80 పరుగుల భారీ తేడాతో ఓటమిపాలైంది. ఇలా హ్యాట్రిక్ ఓటములు నమోదు చేయడంపట్ల అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సన్‌రైజర్స్ కెప్టెన్ పాట్ కమిన్స్ తమ జట్టు ప్రదర్శన పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. తమ జట్టు అత్యుత్తమ ప్రదర్శనకు దూరంగా ఉందని పేర్కొన్నాడు. బౌలింగ్ బాగానే ఉన్నా... ఫీల్డర్లు, బ్యాటర్లు చెతులేత్తేయడంతోనే వరుస ఓటములు తప్పడం లేదన్నారు. ప్రధానంగా టాప్ ఆర్డర్ బ్యాటర్లు విఫలం కావడం దెబ్బ తీస్తుందని తెలిపాడు. నిన్నటి మ్యాచ్‌లో కూడా కీలక సమయాల్లో ఫీల్డర్లు క్యాచ్‌లను చేజార్చడం మ్యాచ్‌పై తీవ్ర ప్రభావం చూపించిందన్నాడు. ఇప్పటికైనా ఈ విభాగాల్లో మెరుగవుతే విజయాల బాట పట్టొచ్చని కమిన్స్ చెప్పుకొచ్చాడు. ఇకనైనా జట్టులోని ఆటగాళ్లు సమిష్టిగా రాణించాల్సి ఉందని ఆయన స్పష్టం చేశారు.
![]() |
![]() |