ఐపీఎల్ 2025లో మ్యాచులు రసవత్తరంగా సాగుతున్నాయి. ఐపీఎల్‌లో విజయవంతమైన జట్లుగా పేరొందిన ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ లాంటి జట్లు పాయింట్ల పట్టికలో వెనకబడ్డాయి. ఇప్పటివరకూ ఒక్కసారి కూడా టైటిల్ సాధించని జట్లయిన.. పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మాత్రం రేసులో ముందంజలో ఉన్నాయి. ఐపీఎల్ 2025లో తొలి 15 మ్యాచులు పూర్తయ్యాక పాయింట్ల పట్టిక ఎలా ఉందంటే..
టాప్‌లో పంజాబ్..
గత కొన్నేళ్లుగా ప్లే ఆఫ్స్ కూడా చేరలేకపోయిన పంజాబ్ కింగ్స్.. ఈసారి పటిష్టంగా కనిపిస్తోంది. శ్రేయస్ అయ్యర్ సారథ్యంలో ఆ జట్టు వరుసగా రెండు విజయాలు సాధించి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉంది.
ఢిల్లీ క్యాపిటల్స్ జోరు..
ఇక రిషభ్ పంత్ జట్టును వీడటంతో కొత్త కెప్టెన్ అక్షర్ పటేల్ సారథ్యంలో బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ జోరు కొనసాగిస్తోంది. లక్నో, సన్ రైజర్స్‌పై విజయం సాధించి.. టేబుల్‌లో రెండో ప్లేసులో ఉంది.
మూడుకు పడిపోయిన ఆర్సీబీ..
గుజరాత్‌తో మ్యాచ్‌కు ముందు వరకు అగ్రస్థానంలో ఉన్న ఆర్సీబీ.. ప్రస్తుతం మూడో స్థానానికి పడిపోయింది. మూడు మ్యాచులలో రెండింట్లో గెలిచి.. మూడో ప్లేసులో కొనసాగుతోంది.
దూసుకొచ్చిన గుజరాత్..
టోర్నీ తొలి మ్యాచులో చిత్తుగా ఓడిపోయిన గుజరాత్ టైటాన్స్.. ఆ తర్వాత బలంగా పుంజుకుంది. వరుసగా రెండు మ్యాచులో గెలిచి.. నాలుగో స్థానానికి చేరుకుంది.
5వ ప్లేసులో డిఫెండింగ్ ఛాంపియన్..
ఆడిన నాలుగు మ్యాచులలో గెలిచిన కోల్‌కతా నైట్ రైడర్స్ ఐదో ప్లేసుకు చేరింది. గురువారం సన్ రైజర్స్‌ను ఓడించి.. అట్టడుగు స్థానం నుంచి తన స్థానాన్ని మెరుగు పర్చుకుంది.
ఇక టాప్-5లో నిలిచిన జట్ల ఖాతాలో నాలుగేసి పాయింట్ల చొప్పున ఉన్నాయి. ఆ తర్వాతి స్థానాల్లో ఉన్న జట్లు మాత్రం ఒక్కో విజయంతో రెండేసి పాయింట్లు సాధించాయి. ముంబై ఇండియన్స్, లక్నో సూపర్ జెయింట్స్, చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ జట్లు.. పాయింట్ల పట్టికలో తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.
![]() |
![]() |