025 IPLలో భాగంగా ఈ రోజు LSG vs MI తలపడుతున్నాయి. ఈ మ్యాచ్ లో ముంబై స్టార్ ప్లేయర్ రోహిత్ శర్మ ఆడటం లేదు. రోహిత్ శర్మ నుంచి బిగ్ ఇన్నింగ్స్ కోసం చూస్తున్న అభిమానులను ఈ విషయం తీవ్రంగా నిరాశపరుస్తోంది. ఈ మ్యాచ్ లో రోహిత్ శర్మ ఎందుకు ఆడటం లేదో కెప్టెన్ హార్దిక్ పాండ్యా చెప్పాడు. లక్నో లోని ఎకానా క్రికెట్ స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్ లో టాస్ సమయంలో రోహిత్ శర్మ ఈ మ్యాచ్ లో ఆడటం లేదని హార్దిక్ పాండ్యా చెప్పాడు. గాయం కారణంగా హిట్ మ్యాన్ ఈ మ్యాచ్ ను ఆడటం లేదని తెలిపాడు. అయితే, రోహిత్ శర్మ గాయం ఎంత పెద్దది? ఎప్పటివరకు ముంబై టీమ్ కు అందుబాటులో ఉంటాడనే విషయం చెప్పలేదు. మోగాలి గాయంతో బాధపడుతున్న ఈ సీనియర్ స్టార్ ప్లేయర్ రోహిత్ శర్మ లేకపోవడం ముంబై ఫ్రాంచైజీకి ఎదురుదెబ్బ అని చెప్పాలి. 2001 తర్వాత తొలిసారి రోహిత్ శర్మ గాయం కారణంగా ఐపీఎల్ మ్యాచ్ కు దూరం అయ్యాడు. చూడాలి రోహిత్ శర్మ మల్లి ఎప్పుడు ఆడతాడో..
![]() |
![]() |