సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్‌హెచ్) తరఫున బరిలోకి దిగిన స్పిన్ ఆల్‌రౌండర్ కమిందు మెండిస్ ఇటీవలే తన గర్ల్‌ఫ్రెండ్ నిష్నిని పెళ్లి చేసుకున్నాడు. అంతకుముందే హనీమూన్ ట్రిప్ కూడా ప్లాన్ చేసుకున్నాడు. కానీ మ్యాచ్ కోసం దాన్ని క్యాన్సిల్ చేసుకుని కోల్‌కతా వచ్చేశాడు. ఇక నిన్న కేకేఆర్‌తో జరిగిన మ్యాచ్‌లో కమిందు ఒకే ఓవర్ బౌలింగ్ చేశాడు. ఈ సమయంలోనే అతడు తన బౌలింగ్‌తో అందర్నీ ఆశ్చర్యపరిచాడు. ఒకే ఓవర్‌లో రెండు చేతులతో బౌలింగ్ చేసి ఔరా అనిపించాడు. వేసింది ఒక్క ఓవరే అయినా.. కేవలం 4 పరుగులే ఇచ్చి ఒక వికెట్ కూడా తీశాడు. దీంతో రెండు చేతులతో బౌలింగ్ చేసి ఐపీఎల్‌లో వికెట్ పడగొట్టిన తొలి బౌలర్‌గా కమిందు మెండిస్ రికార్డు సృష్టించాడు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే.. అతడు ఏ చేతితో బౌలింగ్ వేసినా.. యాక్షన్ మాత్రం ఒకేలా ఉంటుంది. అటు బ్యాటింగ్‌లోనూ అద్భుతమైన షాట్లతో ఆకట్టుకున్నాడు. 29 పరుగులు చేసి పర్వాలేదనిపించాడు. కాగా, గతేడాది నవంబర్‌లో జరిగిన మెగా వేలంలో అతడిని సన్‌రైజర్స్ యాజమాన్యం రూ.75 లక్షలకు కొనుగోలు చేసింది. అయితే తొలి మూడు మ్యాచ్‌లలో అతడికి తుది జట్టులో చోటు దక్కకపోవడంతో బెంచ్‌కే పరిమితమయ్యాడు.
![]() |
![]() |